Friday, February 21, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకృపయా ధ్యాన్ దే!

కృపయా ధ్యాన్ దే!

పాంచభౌతికము దుర్భరమైన కాయం బిదెప్పడో విడుచుట యెఱుకలేదు,
శతవర్షములదాక మితము జెప్పిరి కాని,
నమ్మరాదామాట నెమ్మనమున
బాల్యమందో; మంచి ప్రాయమందో, లేక
ముదిమియందో, లేక ముసలియందొ,
యూరనో, యడవినో, యుదకమధ్యముననో,
యెప్పుడో యేవేళ నే క్షణంబొ?

Youtube : https://www.youtube.com/@MahathiBhakthi
Facebook : https://www.facebook.com/mahathibhakthi
Instagram: https://www.instagram.com/mahathibhakthi/
Twitter : https://x.com/Dhatri_Tv

మరణమే నిశ్చయము, బుద్ధిమంతుడైన
దేహ మున్నంతలో మిమ్ము దెలియవలయు,
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!”

అర్థం:-
మనిషి ఆయుః ప్రమాణం నూరేళ్లు అని చెప్పారు కానీ…మధ్యలోనే ఎప్పుడయినా పోవచ్చు. బాల్యంలోనో, మంచి ప్రాయంలోనో, వృద్ధాప్యంలోనో…ఎప్పుడయినా పోవచ్చు. కాబట్టి నిండు నూరేళ్ల మాట నమ్మకండి…ఊళ్ళోనో, అడవిలోనో, నీళ్ళల్లోనో, రోడ్డు మీదో ఎప్పుడో…ఏ వేళో రాలిపోయే…మట్టిలో కలిసిపోయే మట్టి ప్రాణమిది అని ఏనాడో అన్నాడు ధర్మపురి నరసింహస్వామి గుడి మెట్లమీద కవి శేషప్ప.

ఢిల్లీ రైల్వే స్టేషన్లో పుణ్యానికి పోతే…పాపం ఎదురైనట్లు- మహా కుంభమేళాలో మునగడానికి వెళుతూ స్టేషన్ మెట్లమీద ప్రాణాలు కోల్పోయినవారి గురించి కవి శేషప్ప వైరాగ్య పద్యమే పాడుకుని మనల్ను మనం ఓదార్చుకోవాలి. పుట్టినవాడు గిట్టకతప్పదు.

ఢిల్లీ రేల్వే స్టేషన్లో పద్దెనిమిది మంది ప్రయాణికుల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోవడానికి, అనేకమంది గాయపడ్డానికి కారణం తెలిస్తే గుండె తరుక్కుపోతుంది. న భూతో…న భవిష్యతి అన్నట్లుగా నిర్వహించారన్న ఉత్సవాల కీర్తి కిరీటాల మీద ఉన్న శ్రద్ధ మనకు జనం ప్రాణాల మీద ఉండదు.

ప్రయాగ్ రాజ్ ఎక్స్ ప్రెస్ అప్పటికే ప్లాట్ ఫార్మ్ నంబర్ 14 మీద ఉండగా…ప్రయాగ్ రాజ్ స్పెషల్ ప్లాట్ ఫార్మ్ నంబర్ 16 మీదికి రాబోతోందని మైకులో అనౌన్స్ చేశారు. పైగా ఆరోజు నాలుగు రైళ్ళు ఢిల్లీ నుండి ప్రయాగ్ రాజ్ వెళ్ళాలి. అందులో మూడు ఆలస్యంగా నడుస్తున్నాయి. “ప్రయాగ్ రాజ్” అన్నమాట వినపడగానే ప్లాట్ ఫార్మ్ నంబర్ 14 వైపు వెళుతున్నవారు తమ రైలనుకుని అటు పరుగెత్తారు. అప్పటికే 14 నంబరు దగ్గరున్నవారు కూడా ప్లాట్ ఫార్మ్ మారిందనుకుని పరుగులు తీశారు. ఓవర్ బ్రిడ్జ్ చిన్నది. ఇరుకు మెట్లు. ఒక్కసారిగా ఎక్కే వారు- దిగేవారు. తొక్కిసలాట. నిముషాల్లో ప్రాణాలు పోయాయి.

ప్రగాఢ సానుభూతులు, సంతాపాలు, శాఖాపరమైన విచారణలు, ప్రత్యేక విచారణ కమిటి నిజ నిర్ధారణలు షరామామూలు. “భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం” అన్న అరిగిపోయిన రికార్డే మళ్ళీ వినిపించింది.

పోయిన ప్రాణాలు తిరిగిరావు. ఉన్న ప్రాణాలు మరో స్టేషన్ మెట్లమీద పోకుండా రైల్వే శాఖ అనౌన్స్ మెంట్లో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ చేసిన హత్యలను గుణపాఠంగా తీసుకుంటే మంచిది.

Youtube : https://www.youtube.com/@dhatritvtelugu
Facebook : https://www.facebook.com/dhatritelugutv
Instagram: https://www.instagram.com/dhatritelugutv/
Twitter :https://x.com/Dhatri_Tv

ఈ ఘోరం తరువాత…ఏ రైలు ప్రయాణికులు ఆ ప్లాట్ ఫార్మ్ మీద నిరీక్షిస్తూ…మిగతావారు హోల్డింగ్ జోన్లో ఉండేలా ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయోగాత్మకంగా చేస్తే మెరుగైన ఫలితాలే వచ్చాయని చెబుతున్నారు- పోయినవారి సాక్షిగా.

RELATED ARTICLES

Most Popular

న్యూస్