Thursday, November 21, 2024
Homeసినిమాఓటీటీలోకి వచ్చేస్తున్న 'మిస్టర్ బచ్చన్'

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిస్టర్ బచ్చన్’

ఈమధ్య కాలంలో ఇలా థియేటర్స్ కి వచ్చేసిన చిన్న సినిమాలు అలా ఓటీటీ కి వచ్చేస్తున్నాయి. ఇక నెల గ్యాప్ తో పెద్ద సినిమాలు కూడా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేస్తున్నాయి. అలా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి ‘మిస్టర్ బచ్చన్’ రెడీ అవుతోందని తెలుస్తోంది. రవితేజ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి హరీశ్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 15వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాతోనే టాలీవుడ్ కి పరిచయమైంది.

పీపుల్ మీడియా – టి సిరీస్ కలిసి నిర్మించిన ఈ సినిమాకి, మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగిన కథనే ఎంచుకుని హరీశ్ శంకర్ తనదైన స్టైల్లో ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకుని వచ్చాడు. రవితేజ ఎనర్జీ .. భాగ్యశ్రీ గ్లామర్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయి. అయితే రవితేజ సినిమా నుంచి ఆయన అభిమానులు ఆశించే పూర్తిస్థాయి మసాలాలు కుదరలేదు. అందువలన ఈ సినిమా హిట్ దిశగా అడుగులు వేయలేకపోయింది.

అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ వారు దక్కించుకున్నట్టు సమాచారం. సెప్టెంబర్ 12వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ కథ 1980లలో నడుస్తుంది. ఈ సినిమాలో ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ గా రవితేజ కనిపిస్తాడు. అతను సస్పెన్షన్ కి గురికావడం .. తిరిగి విధుల్లోకి చేరడానికి మధ్యలో కథ, విలేజ్ నేపథ్యంలో కొనసాగుతుంది. ఒకటి రెండు పాటలు … కాస్త ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుందిగానీ, థియేటర్స్ కి వెళ్లిన అభిమానులకు అది సరిపోలేదు. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఏ స్థాయిలో సందడి చేస్తుందనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్