Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్రాణించిన మార్ష్, వార్నర్: ఢిల్లీ గెలుపు

రాణించిన మార్ష్, వార్నర్: ఢిల్లీ గెలుపు

Delhi won: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించింది. రాజస్థాన్ ఇచ్చిన 161 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 11 బంతులు మిగిలి ఉండగానే సాధించింది. పరుగుల ఖాతా తెలవకముందే ఢిల్లీ వికెట్ (శ్రీకర్ భరత్ డకౌట్) కోల్పోయినా వీరిద్దరూ కలిసి రెండో వికెట్ కు 144 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గెలిపించారు.  మార్ష్ 62బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 89 పరుగులు చేసి అవుట్ కాగా, ఓపెనర్ వార్నర్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్సర్ తో 52తో నాటౌట్ గా నిలిచాడు.  చివర్లో కెప్టెన్ పంత్ కూడా కేవలం నాలుగు బంతుల్లో రెండు సిక్సర్లతో 13 పరుగులు చేసి సత్తా చాటాడు. ఢిల్లీ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, యజువేంద్ర చాహల్ చెరో వికెట్ పడగొట్టారు.

రాజస్థాన్ ఆటగాడు, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ లో తొలి అర్ధ సెంచరీ నమోదు చేశాడు. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన అశ్విన్ 38 బంతుల్లో 4  ఫోర్లు, 2 సిక్సర్లతో యాభై పరుగులు చేసి ఔటయ్యాడు.

నవీ ముంబైలోని డా. డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ 11 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ప్రమాదకర ఆటగాడు జోస్ బట్లర్ 7 పరుగులే చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ యశస్వి జైపాల్ 19 చేసి పెవిలియన్ చేరాడు. రవిచంద్రన్ అశ్విన్- దేవదత్ పడిక్కల్ మూడో వికెట్ కు 53 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అశ్విన్ -50; పడిక్కల్ -48 పరుగులు చేసి ఔటయ్యారు. కెప్టెన్ సంజూ శామ్సన్(6); రియాన్ పరాగ్ (9) నిరాశపరచగా, వాండర్ డస్సెన్-12; ట్రెంట్ బౌల్ట్—9 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 60 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో చేతన్ సకారియా, నార్త్జ్, మిచెల్ మార్ష్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

రెండు వికెట్లతో పాటు 89 పరుగులు చేసిన మార్ష్ కు ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్ లభించింది’

Also Read : ఉబెర్ కప్: కొరియా చేతిలో ఇండియా ఓటమి

RELATED ARTICLES

Most Popular

న్యూస్