German Open-2022: జర్మన్ ఓపెన్ 2022 టోర్నీలో రెండోరోజు కూడా ఇండియాకు మిశ్రమ ఫలితాలే దక్కాయి, సింగిల్స్ లో ఆశాజనకమైన ఫలితాలు లభించలేదు, పురుషుల డబుల్స్ లో మూడు జోడీలు ఇండియా తరఫున ఆడగా రెండు జంటలు విజయం సాధించాయి, మహిళల డబుల్స్ లో రెండు జోదీలూ ఓటమి పాలయ్యాయి,
మహిళల సింగల్స్ లో
- కెనడా కు చెందిన మిచేల్లీ లీ 21-18; 22-20; 21-9 తేడాతో ఇండియా ప్లేయర్ మాళవిక బన్సోద్ ను ఓడించింది
డెన్మార్క్ క్రీడాకారిణి లైన్ హెజ్ మార్క్ చేతిలో 21-15;21-14 తేడాతో ఆకర్షి కాశ్యప్ ఓటమి పాలైంది
పురుషుల సింగల్స్ లో
- థాయ్ లాండ్ ఆటగాడు కున్లావుట్ చేతిలో 21-13; 21-13 తేడాతో పారుపల్లి కాశ్యప్ ఓడిపోయాడు.
- శుభంకర్ దేవ్ 21-15; 21-8 తేడాతో చైనా ఆటగాడు జావో జున్ పెంగ్ చేతిలో ఓటమి పాలయ్యాడు.
మహిళల డబుల్స్ లో..
- అశ్విని పొన్నప్ప- సిక్కీ రెడ్డి జోడీ 21-13; 21-13 తేడాతో జపాన్ కు చెందిన నమి మత్సుయామా-చిహారు సిధా చేతిలో ఓడిపోయారు
- థెరీసా జాలీ – గాయత్రి గోపీచంద్ జంట 21-1౫; 21-12 తేడాతో నెదర్లాండ్స్ జోడీ డెబొరా జిల్లె – చెరిల్ సీనేన్ లను ఓడించారు.
పురుషుల డబుల్స్ లో..
- కృష్ణ ప్రసాద్-విష్ణువర్ధన్ గౌడ్ ద్వయం జపాన్ జోడీ హిరోకీ ఒకమురా- మసాయుకి ఒనోడేరా తో జరిగిన హోరాహోరీ పోరులో 24-22; 21-11 తో విజయం సాధించారు
- ఇషాన్ భట్నాగర్ – సాయి ప్రతీక్ జోడీ… ఇంగ్లాండ్ ఆటగాళ్ళు హెమ్మింగ్- స్టాల్ వుడ్ పై 21-15; 21-16తో విజయం సాధించారు.
- ఎమ్మార్ అర్జున్ – ధృవ్ కపిల జోడీ 21-13, 20-22; 21-19 తేడాతో మలేషియా ఆటగాళ్ళు ఒంగ్ యూ సిన్ – తియో యో ఈ ద్వయంపై ఓటమి పాలయ్యారు.
ఇండియా క్రీడాకారులు నేడు ఆడిన మొత్తం తొమ్మిది మ్యాచ్ ల్లో కేవలం మూడు మ్యాచ్ లలోనే విజయం సాధించింది. అదికూడా డబుల్స్ లో కావడం గమనార్హం.
Also Read : జర్మన్ ఓపెన్: సింగిల్స్ లో జోరు; డబుల్స్ లో నిరాశ