Saturday, July 27, 2024
HomeTrending Newsమహిళా పక్షపాతి సిఎం జగన్

మహిళా పక్షపాతి సిఎం జగన్

Women share in MNREGA: రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని, అయన పాలనలో ప్రతి ఇంటిలోనూ మహిళలు శక్తివంతులుగా మారుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నవరత్నాల ద్వారా మహిళా సంక్షేమానికి, అభివృద్ధికి బాటలు వేశారని కొనియాడారు.  మహాత్మాగాంధి ఉపాధి హామీ పథకంలో నూరుశాతం మేట్లుగా మహిళలే బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాష్ట్రం మనదేనని పెద్దిరెడ్డి అన్నారు. నిజాయితీ, బాధ్యతాయుతంగా పనిచేసే మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం నిర్ణయంలో భాగంగా ఉపాధి హామీలో మేట్లుగా మీకు ప్రాధాన్యత ఇచ్చామని వెల్లడించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో ఉపాధి హామీ మహిళా శక్తి అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. మంత్రి పెద్దిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై 75 మంది ఉపాధి హామీ మేట్ లకు అవార్డులను అందించారు. ఉపాధి హామీ కింద లబ్ధిపొందిన మహిళా రైతులను సత్కరించారు. పిఆర్&ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కోన శశిధర్, స్పెషల్ కమిషనర్ శాంతిప్రియ పాండె, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ శ్యామల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కుటుంబానికి కేంద్రంగా, ఆర్థికశక్తిగా మహిళలు మారాలని, పిల్లలకు మంచి విద్య, వైద్యంతో చక్కటి భవిష్యత్తును అందించాలని పెద్దిరెడ్డి సూచించారు. నామినేటెడ్ పదవులు, కాంట్రాక్ట్ పనుల్లోనూ మహిళలకు యాబై శాతం రిజర్వేషన్లు కల్పించామని ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్ పదవుల్లో యాబైశాతం మహిళలకే కట్టబెట్టిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని వివరించారు.

ఉపాధి హామీ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా 91 లక్షల జాబ్ కార్డులు ఉంటే అందులో 64 లక్షల మంది మహిళలు ఉన్నారన్నారు. ఉపాధి హామీ మేట్లుగా మీరు చేసే మార్కింగ్, పని ప్రదేశంలో వనరుల కల్పన, మస్టర్లు రాయడం పారదర్శకంగా చేస్తున్నారని, అందుకే ఎక్కువ మంది మహిళా మేట్లపై నమ్మకంతో ఉపాధి హామీ పనులకు వస్తున్నారని మంత్రి కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.13 లక్షల మంది మహిళలు మేట్లుగా ఉపాధి హామీ పథకంకు కీలకమైన స్థానంలో ఉండి పనిచేస్తున్నారు.  గత ఏడాది మనం 25.92 కోట్ల పనిదినాలను చేశాం. ఈ ఏడాది ఇప్పటి వరకు 22 కోట్ల పనిదినాలు పూర్తయ్యాయని, ఈ నెలాఖరు నాటికి కనీసం 24 కోట్ల పనిదినాలు పూర్తి చేసేలా మేట్లు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్