కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన రాజీనామా నిర్ణయానికి గల కారణాలను వివరిస్తూ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ , రాహుల్ గాంధీలకు సుదీర్ఘమైన లేఖ రాశారు. మూడు పేజీల లేఖను విడుదల చేసిన జగ్గారెడ్డి ముఖ్యంగా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యాక పార్టీలో జరుగుతున్న పరిణామాలు తన ఆవేదనను వెలిబుచ్చారు.
జగ్గారెడ్డి లేఖలో అంశాలు..
పార్టీ వీడిన గాంధీ కుటుంబం పై గౌరవం తో ఉంట.. ఈ ప్రకటన విడుదల చేసిన నాటి నుండి నేను కాంగ్రెస్ గుంపులో ఉండను. త్వరలో పార్టీ పదవికి , కాంగ్రెస్ పార్టీ ప్రథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తాను. కాంగ్రెస్ లో సడన్ గా వచ్చి లాబీయింగ్ చేసి పీసీసీ అధ్యక్షుడు కావొచ్చు. సొంత పార్టీలోనే కుట్రపూరితంగా కాంగ్రెస్ కోవర్టుగా నాపై ముద్రవేస్తున్నారు. పార్టీలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కోవర్ట్ అని కొందరు యూట్యూబ్ చానెల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ లో గతంలో పార్టీలో వివాదాలు ఉన్న హుందాగా ఉండేది.. కానీ ఇప్పుడు ఆ హుందాతనం లేదు.
కాంగ్రెస్ లో జరుగుతున్న అవమానాలు భరించలేకనే రాజీనామా చేసి ప్రజల్లో స్వతంత్రంగా సేవ చేస్తా. పార్టీలో ఎవ్వరు కోవర్టులో అధిష్టానం గుర్తించాలి. తెలంగాణలో 2017 సంవత్సరంలో పార్టీ అధినేత రాహుల్ గాంధీ సభ పెట్టమంటే ఎవ్వరు సభ పెట్టడానికి ముందుకు రాకుంటే నేను కోట్ల రూపాయలు ఖర్చు చేసి సభ నిర్వహించాను. ఆ సభ నుండి పార్టీ రాష్ట్రంలో బలపడింది.. పార్టీ కోసం కష్టపడిన నేనా కోవర్టుని… సభను నిర్వహించకుండా మౌనంగా ఉన్న నేతల కోవర్టులు…? ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నుండి ఎవ్వరు అభ్యర్థులు పేట్టకుంటే తాను మెదక్ జిల్లా నుండి అబ్యర్దిని పెట్టి…. కోట్లు ఖర్చు పెట్టి పార్టీ కి ఒక్క ఓటు తగ్గకుండా పార్టీ పరువు నిలిపాను …పార్టీ సీనియర్లు ఎవ్వరు కనీసం అభ్యర్థిని పెట్టకుండా మౌనంగా ఉన్నారు… ఎవరు కోవర్తులు…అబ్యర్దిని పెట్టినవాళ్ళ…? లేక పెట్టని వాళ్ళ…?
ఇటీవల హుజూరబాద్ ఉప ఎన్నికల్లో 40 వేల కాంగ్రెస్ ఓట్ల ను మూడువేల ఓట్ల కు పరిమితం చేసిన వాళ్ళు కోవర్తులా….? నేనా… గాంధీ కుటుంబం పై బీజేపీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ముందు ఖండించింది నేను.. మరి పార్టీలో పదవులు అనుభవిస్తున్నవాళ్ళు ఎందుకు స్పందించలేదు. మాట్లాడకుండా మౌనంగా ఉన్నవాళ్లు కోవర్తులా .?
లేక నేనా…అధిష్టానం గుర్తించాలి.