Saturday, January 18, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్పిల్లలకు 10 లక్షల బాండ్ల పంపిణీ

పిల్లలకు 10 లక్షల బాండ్ల పంపిణీ

కోవిడ్ నేపథ్యంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన ఆర్ధిక సాయం బాండ్లను సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి అందజేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఒకొక్కరికి 10 లక్షల రూపాయల బాండ్లను  పిల్లల చేతికి అందించారు.

ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన ఈ కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, మన తర్వాత ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా అమల్లోకి తెచ్చిందని కాకాణి గుర్తు చేశారు.  ఈ గొప్ప పనికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపారు.  సర్వేపల్లి నియోజకవర్గంలో నలుగురు పిల్లలు కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయారని, వారికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున బాండ్లను అందజేశామని వెల్లడించారు. ఇది గాక ఈ పిల్లలకు నెలకు 500 రూపాయల చొప్పున ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తామని వివరించారు.

వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికార పార్టీ శాసనసభ్యునిగా అభివృద్ధి, సంక్షేమ, సేవా కార్యక్రమాలను ప్రజలకు అందించే అవకాశం కలగడం నా భాగ్యంగా భావిస్తున్నానని కాకాణి అభిప్రాయం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్