Friday, March 29, 2024
HomeTrending Newsబ్లాక్ ఫంగస్ మందుపై నో జిఎస్టీ : నిర్మలా సీతారామన్

బ్లాక్ ఫంగస్ మందుపై నో జిఎస్టీ : నిర్మలా సీతారామన్

కరోనా మందులు, చికిత్సకు ఉపయోగించే పరికరాలపై జిఎస్టీ తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈరోజు సమావేశమైన జిఎస్టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇది సింగల్ పాయింట్ అజెండా సమావేశమని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కరోనా చికిత్స కు ఉపయోగించే మూడు మందులతో పాటు బ్లాక్ ఫంగస్ చికిత్సకు వాడే అంఫో టెరిసిన్-బి మందుకు జిఎస్టీ మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు.

అంబులెన్స్ వాహనాలపై ప్రస్తుతం ఉన్న 28 శాతాన్ని 12కు తగ్గించారు. కోవిడ్ టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్స్, పల్స్ ఆక్సీమీటర్లపై జిఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నామని….హ్యాండ్ శానిటైజర్స్, టెంపరేచర్ చూసే పరికరాలు, స్మశానాల్లో వాడే ఎలక్ట్రిక్ ఫర్నేస్ లపై 18 నుంచి 5 శాతానికి కుదిస్తున్నట్లు సీతారామన్ వివరించారు. కోవిడ్ వ్యాక్సిన్ పై ప్రస్తుతం ఉన్న 5 శాతం జిఎస్టీ కొనసాతుందని స్పష్టం చేశారు.

మే 28న జరిగిన జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కోవిడ్ పరికరాలు, వైద్య పరికరాలపై జిఎస్టీ సవరించేందుకు మంత్రుల సంఘాన్ని నియమించారు. ఈ సంఘం సిఫార్సులపై చర్చించేందుకు జిఎస్టీ కౌన్సిల్ నేడు భేటి అయ్యింది. వివిధ రాష్ట్రాల మంత్రులు వర్చువల్ గా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సవరించిన జిఎస్టీ సెప్టెంబర్ ౩౦ వరకూ అమల్లో ఉంటుంది, ఆ సమయానికి పరిస్థితిని అంచనా వేసి మరోసారి దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్