Saturday, January 18, 2025
HomeTrending Newsఎంపి కోమటిరెడ్డి కోవర్ట్... సీతక్క ఫైర్

ఎంపి కోమటిరెడ్డి కోవర్ట్… సీతక్క ఫైర్

భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌పై ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో తమ్ముడి తరఫున ప్రచారం చేస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఆమె నిప్పులు చెరిగారు. నాంపల్లి మండలంలో ప్రాచారం నిర్వహిస్తున్న సీతక్క… వెంకట్‌ రెడ్డి ఓ దుర్మార్గుడు అని, అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పక్కన పెట్టాల్సిందేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని ప్రచారం చేయడం ఎంత వరకు సరైనది అని ప్రశ్నించారు.

కోమటిరెడ్డి కోవర్ట్ ఆపరేషన్ పనికిమాలిన చర్య అని అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన షోకాజ్ నోటీసులకు కోమటిరెడ్డి జవాబు చెప్పాల్సిందేనని సీతక్క డిమాండ్ చేశారు. బంధాలకతీతమే రాజకీయాలు.. నిబద్ధత గల రాజకీయాలు చేయాలనుకుంటే.. పార్టీ నిబంధనలు, సిద్ధాంతాలకు కట్టుబడి పని చేయాలని సూచించారు. తమ్ముడి గెలుపే ముఖ్యమైతే.. కాంగ్రెస్ కండువాను తీసి పక్కనపెట్టి, బీజేపీ కండువా కప్పుకొని ప్రచారం చేయాలని ధ్వజమెత్తారు. ఆపదలో అండగా ఉండాల్సింది పోయి ఆస్ట్రేలియాకు పోవడం ఏంటని సీతక్క నిలదీశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్