Sunday, January 19, 2025
HomeTrending Newsతెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైంది. హైద‌రాబాద్ – రంగారెడ్డి – మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ టీచ‌ర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక‌ల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం గురువారం విడుద‌ల చేసింది. ఈ ఎన్నిక‌కు సంబంధించి ఈ నెల 16వ తేదీ నోట‌ఫికేష‌న్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 23వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్ల‌కు అవ‌కాశం క‌ల్పించారు. మార్చి 13న ఎన్నిక‌ల పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. 16న ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు. ఇప్ప‌టికే ఆయా ఉపాధ్యాయ సంఘాల అభ్య‌ర్థులు ప్ర‌చారంలో మునిగి తేలుతున్నారు.

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ వివరాలు

మూడు గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్

టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు:
1. ప్రకాశం నెల్లూరు చిత్తూరు
2. కడప అనంతపురం కర్నూలు

పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలు:

1. ప్రకాశం- నెల్లూరు -చిత్తూరు
2. కడప- అనంతపురం- కర్నూలు
3. శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్నం

ఫిబ్రవరి 16న నోటిఫికేషన్

మార్చి 13న పోలింగ్

మార్చి 16న కౌంటింగ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్