Saturday, June 13, 2026
HomeTrending Newsపుష్కర్ దేవాలయంలో కవిత ప్రత్యేక పూజలు

పుష్కర్ దేవాలయంలో కవిత ప్రత్యేక పూజలు

రాజస్థాన్ లోని ప్రఖ్యాత పుణ్య క్షేత్రం పుష్కర్ లోని బ్రహ దేవాలయం సందర్శించిన ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత నాథ్ ద్వారా లోని పేరెన్నికగన్న శ్రీనాథ్ జీ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ కవిత. ఈ సందర్భంగా ఆలయ అధికారులు కవితకు ఘన స్వాగతం పలికారు.  తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు కవిత వెల్లడించారు.

Mlc Kavita Nath Dwara

అంతకు ముందు రాజస్థాన్ లోని అజ్మీర్‌లో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం ఖ్వాజా మొహియుద్దీన్‌ చిస్తీ దర్గాను సందర్శించారు. ఆమెకు దర్గా పెద్దలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మొహియుద్దీన్‌ చిస్తీ దర్గాకు చాదర్ ను సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు కవిత తెలిపారు.

అనంతరం దర్గా పెద్దలను కల్వకుంట్ల కవిత కలుసుకున్నారు. మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని కొనియాడారు. సీఎం కెసిఆర్ నాయకత్వంలో లౌకికత్వానికి తెలంగాణ ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు. ఎమ్మెల్సీ కవిత తో పాటు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆజం అలి , బోధన్ ఎమ్మెల్యే షకీల్ గారి సతీమణి అయేషా, బొరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దిన్ , టీఆర్ఎస్ నాయకులు కుద్దూస్, నవీద్ ఇక్బాల్ మరియు అలిం తదితరులు అజ్మీర్ దర్గాని సందర్శించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular