Monday, June 15, 2026
Homeసినిమాపవన్ తో అనుకుంటే.. మరో హీరోతో సెట్ అయ్యిందా..?

పవన్ తో అనుకుంటే.. మరో హీరోతో సెట్ అయ్యిందా..?

పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీతో రీ ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయ్యింది. ఆతర్వాత ‘భీమ్లా నాయక్’ అంటూ మరో సినిమా చేశారు. క్రిష్ డైరెక్షన్ లో ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమాతో పాటు హరీష్ శంకర్ డైరెక్షన్ లో ‘భవదీయుడు భగత్ సింగ్’, సముద్రఖని డైరెక్షన్ లో ‘వినోదయ సీతం’ సినిమాలు చేసేందుకు ఓకే చెప్పారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పారు.

ఈ సినిమాలతో పాటు డైరెక్టర్ సుజిత్ తో కూడా పవన్ ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పారు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించాలి అనుకున్నారు. త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ సెట్ చేశారని వార్తలు వచ్చాయి. సుజిత్ డైరెక్షన్ లో పవన్ ‘తెరి’ మూవీని రీమేక్ చేయనున్నారని.. అంతా సెట్ అయ్యింది త్వరలో అనౌన్స్ మెంట్ అని టాక్ వినిపించింది. అయితే.. పవన్ తో సినిమా అంటే అది ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో..?  ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. అందుచేత పవన్ తో మూవీ చేస్తే.. టైమ్ వేస్ట్ అవుతుంది అనుకన్నాడో ఏమో కానీ సుజిత్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని తెలిసింది.

ప్రస్తుతం సుజిత్ మైత్రీ మూవీస్ సంస్థలో వుంటున్నారట. అక్కడే వర్క్ చేసుకుంటున్నారట. తెరి రీమేక్ హక్కులు మైత్రీ దగ్గరే వున్నాయి. పవన్ కళ్యాణ్ ఓ సినిమాను మైత్రీకి చేయాల్సి వుంది. మరి ఆ విధంగా సుజిత్ అక్కడ వున్నారేమో అన్న టాక్ ఒకటి వుంది. కానీ అది కాదు విషయం. సుజిత్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ సినిమా చేయబోతోందట. వరుణ్ తేజ్ కు లైన్ చెప్పారని, ఆ లైన్ ను డెవలప్ చేసే పనిలోనే వున్నారని సమాచారం. ఈవిధంగా పవన్ తో అనుకుంటే.. వరుణ్ తో మూవీ సెట్ అయ్యిందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular