టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న బ్యూటీ! 

ఇటీవల కాలంలో తెలుగు తెరకి చాలామంది కథానాయికలు పరిచయమయ్యారు. ఇప్పుడు మరో బ్యూటీ తెలుగు తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ఆ అందాల సుందరి పేరే ‘యుక్తి తరేజా’. హర్యానాకి చెందిన ఈ అమ్మాయి మోడల్ గా మంచి మార్కులు కొట్టేసింది. మోడలింగ్ లో బిజీగానే ఉంది. చాలామంది మోడల్స్ .. ఆ వైపు నుంచి సినిమాల వైపు అడుగువేసినవారే. అలా యుక్తి కూడా మోడలింగ్ నుంచి సినిమాల వైపు వచ్చింది.

తెలుగులో ఈ సుందరి ‘రంగబలి’ సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. నాగశౌర్య హీరోగా ఈ సినిమా రూపొందుతోంది. చెరుకూరి సుధాకర్ నిర్మించిన ఈ సినిమాకి పవన్ బసంశెట్టి దర్శకత్వం వహించాడు. పవన్ సీహెచ్ సంగీతాన్ని సమకూర్చాడు. జులై 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ వలన, ఈ సుందరికైతే మంచి మార్కులే పడ్డాయి. నాజూకుగా ఉందనే టాక్ యూత్ వైపు నుంచి వచ్చింది.

రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ ను బట్టి చూస్తే, ఈ సినిమాలో కామెడీకి పెద్దపీట వేసినట్టుగా కనిపిస్తోంది. హాయిగా నవ్వుకునే కామెడీనే ఉన్నట్టుగా అనిపిస్తోంది. సప్తగిరి .. సత్య .. గోపరాజు రమణ వంటివారి పాత్రలవైపు నుంచి కావలసినంత ఎంటర్టైన్మెంట్ ను తీసుకువచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా హిట్ అయితే, యుక్తికి మరిన్ని సినిమాలు వచ్చే  అవకాశాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *