రెండు పార్టులుగా మహేష్‌-రాజమౌళి మూవీ?

ఒక సినిమా కథను రెండు పార్టులుగా తీసి ఎలా సక్సెస్ సాధించాలో.. ఎలా ప్రాఫిట్ సాధించాలో ‘బాహుబలి’తో రాజమౌళి  నిరూపించారు. ఆ తర్వాత నుంచి అందరూ అదే బాటలో నడుస్తున్నారు. పుష్ప రెండు పార్టులు, కేజీఎఫ్ రెండు పార్టులు..  కోలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం సైతం పొన్నియిన్ సెల్వన్ కూడా రెండు పార్టులుగా తెరకెక్కించడానికి స్పూర్తి రాజమౌళి అని ప్రకటించడం విశేషం. ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని కూడా రెండు పార్టులుగా తీయనున్నారని టాక్.

మహేష్‌, రాజమౌళి మధ్య ఈ విషయమై చర్చలు జరగుతున్నాయని తెలిసింది. రెండు భాగాలుగా తీసేంత స్టఫ్ ఈ సినిమా కథలో ఉందని.. అలాంటప్పుడు దీనిని వదులుకోకూడదనేది రాజమౌళి ఆలోచన. అయితే.. రెండు పార్టులుగా తీయాలనుకుంటే.. ఎక్కువ బడ్జెట్ అవుతుంది.. ఎక్కువ టైమ్ పడుతుంది. రాజమౌళి సినిమా అంటే కనీసం రెండు సంవత్సరాలు డేట్స్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు పార్ట్ 2 కూడా అంటే మరో సంవత్సరం డేట్స్ ఇవ్వాల్సిందే. బాహుబలి విషయంలో ఇదే జరిగింది. అయినప్పటికీ ఆ కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం వచ్చింది.

రాజమౌళి అనుకున్నాడంటే.. చేసి తీరతాడు. మహేష్‌ బాబు కూడా రాజమౌళి ఆలోచనకు తగ్గట్టుగా వర్క్ చేయాలనుకుంటున్నాడట. ఈ వార్త తెలిసినప్పటి నుంచి ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి ఏర్పడింది. ఇందులో బాలీవుడ్, హాలీవుడ్ ఆర్టిస్టులు కూడా నటించనున్నారు. దీంతో ఈ పాన్ వరల్డ్ మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి.. ఈ పాన్ వరల్డ్ మూవీతో మహేష్‌, రాజమౌళి చరిత్ర సృష్టిస్తారని ఆశిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *