Monday, February 24, 2025
HomeTrending Newsశ్రీకాకుళం జిల్లాలో 40 కోతులు మృతి

శ్రీకాకుళం జిల్లాలో 40 కోతులు మృతి

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం శిలాగం సమీపంలో 40కి పైగా కోతులు మృతి చెందాయి. వీటిని జగనన్న కాలనీ రహదారి పక్కన కుప్పగా పడేశారు. పక్కనే ఉన్న తోటలో మరికొన్ని కోతులు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన కొంతమంది యువకులు.. వాటికి బిస్కెట్‌లు, రొట్టెలు, నీటిని అందించారు. విషప్రయోగం జరిగిందా లేక విద్యుదాఘాతానికి గురయ్యాయా తెలియాల్సి ఉంది. ఎవరు చంపారు? ఎక్కడినుంచి తెచ్చి అక్కడ పడేశారన్నది తెలియాల్సి ఉంది.

ఏకంగా 40కి పైగా కోతులు మృతి చెందిన ఘటన ఆ ప్రాంతలో కలకలం రేపింది. అసలు అన్ని కోతులు అటువైపు ఎందుకు వచ్చాయి, వాటిని ఎవరు చంపారు అన్న అంశంపై స్పష్టత లేకపోయినప్పటికీ.. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ విషప్రయోగం జరిగితే నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్