Thursday, February 27, 2025
Homeస్పోర్ట్స్IPL: ముంబై బోణీ- ఢిల్లీకి నాలుగో ఓటమి

IPL: ముంబై బోణీ- ఢిల్లీకి నాలుగో ఓటమి

ఐపీఎల్ ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. చివరి బంతి వరకూ నరాలు తెగే ఉత్కంఠతో సాగిన నేటి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.  ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ సొగసైన ఆటతో 45 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 65 పరుగులు చేసి సత్తా చాటాడు.  చివరి రెండు ఓవర్లలో 20 పరుగులు కావాల్సిన దశలో టీమ్ డేవిడ్- కామెరూన్ గ్రీన్ లు బాధ్యతాయుతంగా ఆడి జట్టును గెలిపించారు. చివరి బంతికి రెండు పరుగులు కావాల్సిన దశలో టిమ్ డేవిడ్ కవర్ డ్రైవ్ కొత్తగా వేగంగా రెండు పరుగులు తీసి జట్టుకు విజయం అందించి పెట్టారు. టిమ్ 11  బంతుల్లో ఒక సిక్సర్ తో 13; గ్రీన్ 8 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ తో 17 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ వార్నర్-51;  మనీష్ పాండే-26 మినగా ఢిల్లీ టాపార్డర్ మరోసారి విఫలమైంది. పృథ్వీ షా-15; యష్ దుల్-2; రోమన్ పావెల్-4; లలిత్ యాదవ్-2… నిరాశ పరిచారు. అక్షర్ పటేల్ మరోసారి బ్యాట్ తో రాణించి 25 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. 19.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

ముంబై బౌలర్లలో బెహ్రెండ్రాఫ్, పియూష్ చావ్లా చెరో 3; రీలీ మెరెడిత్ 2; హ్రితిక్ షోకీన్ ఒక వికెట్ పడగొట్టారు.

తొలి వికెట్ కు  ముంబై 71 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 26 బంతుల్లో 6 ఫోర్లతో 31 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు.  ఫస్ట్ డౌన్ లో వచ్చిన తిలక్ వర్మ సైతం ధాటిగా ఆడి 29 బంతుల్లో 1 ఫోర్,4 సిక్సర్లతో41 పరుగులు చేసి ఔటయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ మరోసారి గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. ఆ కాసేపటికే రోహిత్ కూడా పెవిలియన్ చేరాడు.

ఢిల్లీ బౌలర్లో ముఖేష్ కు 2; ముస్తాఫిజూర్ రెహ్మాన్ కు ఒక వికెట్ దక్కింది.
రోహిత్ శర్మకు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది

RELATED ARTICLES

Most Popular

న్యూస్