Friday, April 11, 2025
Homeస్పోర్ట్స్Women’s T20 WC: ఐర్లాండ్ పై పాక్ గెలుపు

Women’s T20 WC: ఐర్లాండ్ పై పాక్ గెలుపు

మహిళల టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ 70 పరుగుల తేడాతో ఐర్లాండ్ ను ఓడించింది. పాక్ ఓపెనర్, వికెట్ కీపర్ మునీబా అలీ ఈ టోర్నీలో తొలి సెంచరీ నమోదు చేసింది. 68 బంతుల్లో 14 ఫోర్లతో 102 పరుగులు సాధించి 19వ ఓవర్ చివరి బంతికి ఔటయ్యింది. నిదా దార్ కూడా 33 పరుగులతో సత్తా చాటింది. మహిళల టి20లలో సెంచరీ సాధించిన ఆరో బ్యాట్స్ విమెన్ గా, పాక్ తరఫున తొలి ప్లేయర్ గా మునీబా రికార్డు సాధించింది.

కేప్ టౌన్ లోని న్యూ లాండ్స్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో ఐర్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాక్ నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 165 పరుగుల స్కోరు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ కీలక భాగంస్వామ్యం నమోదు చేయడంలో విఫలమైంది. జట్టులో ఓర్లా  ప్రెందర్ గాస్ట్-31; ఈమార్ రిచర్డ్సన్-28 మాత్రమే రాణించారు. 16.3 ఓవర్లలో 95 పరుగులకే ఐర్లాండ్ ఆలౌట్ అయ్యింది.

పాకిస్తాన్ బౌలర్లలో నష్రా సందు 4; సదియా ఇక్బాల్, నిదా దార్ చెరో 2; ఫాతిమా సనా, తూబా హాసన్ చెరో వికెట్ పడగొట్టారు.

మునీబా అలీకే ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్