Thursday, April 10, 2025
HomeTrending Newsగవర్నర్ రాజకీయ వ్యాఖ్యలు సరికాదు -గుత్తా

గవర్నర్ రాజకీయ వ్యాఖ్యలు సరికాదు -గుత్తా

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ కారణంతో రాజీనామా చేస్తున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. రాజీనామాకు కారణాలు ఆయనే వెల్లడించాలన్నారు. నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ ..మునుగోడులో పోటీ ఎవరు చేస్తారనేది ముఖ్యమంత్రి నిర్ణయిస్తారని గుట్ట సుఖేందర్ రెడ్డి తెలిపారు. గట్టుప్పల్ మండల ఏర్పాటు ఎప్పుడో నిర్ణయించారని, మునుగోడులో పోటీ పై తనతో ఎవరు మాట్లాడలేదన్నారు. మండలి చైర్మన్ పదవీ లో సంతృప్తిగా ఉన్నానని, సర్వే లు బీజేపీ పుంజుకున్నా …టీఆర్ఎస్దే అధికారం అని చెప్పాయన్నారు.

కేంద్రంపై సీఎం గట్టిగా మాట్లాడినా అన్ పార్లమెంటరీ మాట్లాడరని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. రాజ్యాంగ బద్ధ పదవుల్లో ఉన్న వాళ్ళు హుందాగా ఉండాలని, తానైనా… గవర్నర్ ఐనా అది కాపాడుకోవాలన్నారు. ఆమె పరిధిలో ఆమె ఉండాలని, గవర్నర్ రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. షర్మిల రాజన్న రాజ్యం అంటే అసలు తెలంగాణ వచ్చేది కాదని, షర్మిలను ఎవరు పట్టించుకుoటారన్నారు. TRS ఎమ్మెల్యేలను చీల్చిన చరిత్ర .. పాస్పోర్ట్ కావాలన్నది వైఎస్ఆర్ అని రాజన్న రాజ్యం అంటే ఏపీకి వెళ్ళాలని గుత్తా సుఖేందర్ రెడ్డి హితవు పలికారు.

Also Read : తెలంగాణపై కేంద్రం వివక్ష గుత్తా సుఖేందర్ రెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్