Murali Mohan Clapped The First Movie Of Kvkr Banner :
కేవీకేఆర్ పతాకం పై పృథ్వీ దండమూడి హీరోగా రమేష్ కుందేటి దర్శకత్వంలో భస్వంత్ కంభంపాటి నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నెం-1 చిత్రం పూజా కార్యక్రమాలు లాంఛనంగా ఈ రోజు సంస్థ కార్యాలయంలో జరిగాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు మురళీమోహన్, పథ్వీ రాజ్, కృష్ణభగవాన్, శ్రీలక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ నటుడు మురళీ మోహన్ హీరో పృథ్వీ దండమూడి పై క్లాప్ కొట్టి దర్శక నిర్మాతలకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం దర్శకుడు రమేష్ కుందేటి మాట్లాడుతూ “నవంబర్ ఫస్ట్ నుంచి షెడ్యూల్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేయడానికి ప్లాన్ చేశాం. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాం” అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ః కళ్యాణ్ బి, ఎడిటర్ః తుషార పాల, ఆర్ట్ డైరక్టర్ః థెరిసా స్వేచ్ఛ; కాస్ట్యూమ్ డిజైనర్ః లాహిత్యరెడ్డి; సంగీతంః శేఖర్ మోపూరి; పాటలుః సురేష్ గంగుల; పీఆర్వోః రమేష్ చందు; నిర్మాతః భస్వంత్ కంభంపాటి; డైరక్టర్ః రమేష్ కుందేటి
Must read : అసెంబ్లీలో ఇక ట్రిపుల్ ఆర్ సినిమానే…