Sunday, January 19, 2025
HomeTrending Newsముస్తాక్ అహ్మద్ జర్గర్ కరుడుగట్టిన ఉగ్రవాది

ముస్తాక్ అహ్మద్ జర్గర్ కరుడుగట్టిన ఉగ్రవాది

Mustaq Ahmed : కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే పఠాన్ కోట్ హ్యండ్లర్ జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాది పాకిస్తాన్ కు చెందిన అలీ కాషిఫ్ జాన్ ను ఉగ్రవాదిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా అల్‌ ఉమర్-ముజాహిదీన్ వ్యవస్థాపకుడు, చీఫ్ కమాండర్ అయిన ముస్తాక్ అహ్మద్ జర్గర్‌ను చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967 ప్రకారం ఉగ్రవాదిగా హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ముస్తాక్ అహ్మద్ జర్గర్ కరుడుగట్టిన ఉగ్రవాది… గతంలో ఇతన్ని జమ్మూకశ్మీర్ లో భద్రతా సిబ్బంది అరెస్ట్ చేసింది. అయితే ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ ఐసీ-814 విమానం హైజాక్ సమయంలో అప్పటి అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వం భారతీయులను హైజాకర్ల నుంచి విడిపించేందుకు ముస్తాక్ అహ్మద్ జర్గర్ ను విడుదల చేసింది. నేపాల్ ఖాఠ్మాండు నుంచి ఢిల్లీకి వస్తున్న విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి లాహోర్, దుబాయ్ మీదుగా ఆప్ఘనిస్తాన్ కాందహార్ తీసుకెళ్లారు. భారత్ లో బందీలుగా ఉన్న మసూద్ అజర్, ముస్తాక్ అహ్మద్ జర్గర్, అహ్మద్ ఉమర్ సయీద్ షేక్ లను విడిచిపెడితేనే బందీలుగా ఉన్న ప్రయాణికులను ప్రాణాలతో వదిలేస్తామని ఉగ్రవాదులు చెప్పడంతో ప్రభుత్వానికి గత్యంతరం లేక భారత ప్రభుత్వం వీరిని వదిలిపెట్టింది. వదిలిపెట్టిన ఉగ్రవాదుల్లో మసూద్ అజర్ 2008లో ముంబై అటాక్స్, 2019లో పుల్వామా దాడులకు కారణం అయ్యాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్