Friday, March 29, 2024
Homeసినిమా'కేజీఎఫ్ 2' 'అధీర' పాత్ర అదిరిందా?

‘కేజీఎఫ్ 2’ ‘అధీర’ పాత్ర అదిరిందా?

KFG-2: కన్నడ హీరో యష్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్‘ సినిమాను తెరకెక్కిస్తున్నప్పుడు, ఎవరూ కూడా ఆ సినిమాను గురించి అంతగా పట్టించుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో యష్ కి వచ్చిన క్రేజ్ సీనియర్ స్టార్ హీరోలను సైతం కంగారు పెట్టింది. ఈ సినిమా బాలీవుడ్ ను సైతం షేక్ చేయడంతో, సీక్వెల్లో సంజయ్ దత్ ను తీసుకున్నారు. ప్రతి నాయకుడిగా ఆయన పాత్రను చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ఈ పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని భావించారు.

అలాంటి ఈ సినిమా ఈ రోజున భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్టు పార్టులో ‘గరుడ’ చనిపోతే, ఆ తరువాత ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయనే దాని దగ్గర నుంచి సెకండ్ పార్ట్ మొదలవుతుంది. ఫస్టు పార్టు  చూడనివారికి, తెరపై హడావిడి చేస్తున్న కొన్ని పాత్రలు రిజిస్టర్ కావడానికి కొంత సమయం పడుతుంది. ఈ సినిమాలో యష్ .. సంజయ్ దత్ .. రవీనా టాండన్ .. శ్రీనిధి శెట్టి పాత్రలు ప్రధానమైనవిగా కనిపిస్తాయి. శ్రీనిధి శెట్టి అందంగా కనిపిస్తూ .. ఎమోషనల్ టచ్  ఇస్తూ తన పాత్రకి న్యాయం చేసింది. ఇక ప్రధాని పాత్రను రవీనా గొప్పగా పండించింది.

యష్ పాత్రను ఎక్కడ .. ఎప్పడూ తగ్గకుండా చూపించడంలో ప్రశాంత్ సక్సెస్ అయ్యాడు. అయితే సంజయ్ దత్ పోషించిన  అధీర పాత్ర మాత్రం, అంచనాలను అందుకోలేదేమో అనిపించక మానదు. అధీరగా సంజయ్ దత్ లుక్ ను డిఫెరెంట్ గా డిజైన్ చేశారు. ఆ లుక్ కాస్త భయాన్ని కలిగించేలానే ఉంటుంది. హీరోను చప్పరించి పారేస్తాడేమోనని అనిపిస్తుంది. అలాంటి పాత్ర ఓ నూనూగు మీసాల కుర్రాడిని చంపడంతో ఎంట్రీ ఇస్తుంది. అంతోటి ఆర్టిస్ట్ కి ఇలాంటి ఇంట్రడక్షనా? అనిపిస్తుంది. ఒక సందర్భంలో అధీర .. హీరోతో తలపడతాడు. కానీ ఆ లుక్ కి తగిన పవర్ఫుల్ డైలాగ్స్ లేకపోవడం ఆ పాత్ర వైపు నుంచి వెలితిగా కనిపిస్తుంది. ఈ విషయంలో మరికాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండునే అనిపిస్తుంది.

Also Read : ‘కేజీఎఫ్’ ‘కన్నడ పవర్’ కు అంకితమిస్తున్నా:  ప్ర‌శాంత్ నీల్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్