Sunday, February 23, 2025
HomeTrending Newsనా బలం కేసీఆర్, నా బలగం ఖమ్మం ప్రజలు - నామా

నా బలం కేసీఆర్, నా బలగం ఖమ్మం ప్రజలు – నామా

మధుకాన్ సంస్థ పై వస్తున్న వార్తల్లో నిజం లేదని లోక్ సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు తెలిపారు. నా గురించి ప్రజలందరికీ తెలుసు అన్న నామా నీతి నిజాయితీ తో పనిచేస్తానన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు రాజ్యాంగ వ్యవస్థ అనే బాటలో ముందుకు వెళ్తున్నానని, మధుకాన్ సంస్థ పై వస్తున్నవి తప్పుడు ఆరోపణలని హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో నామా ఖండించారు.

మా నాయకుడు కేసీఆర్ బాటలో నడుస్తానన్న నామా నాగేశ్వరరావు నా బలం కేసీఆర్, నా బలగం ఖమ్మం ప్రజలన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను కేసీఆర్ వెంటనే నడుస్తానని ప్రకటించారు. 40 ఏళ్ల క్రితం మధుకాన్ సంస్థను స్థాపించాను. చైనా బోర్డర్ లో మదుఖాన్ కంపెనీలు పనిచేస్తున్నాయి. కంపెనీల్లో తను డైరెక్టర్ గా లేనని తన తమ్ముళ్లు చూస్తున్నారని నామా వివరించారు. కాంట్రాక్టు నిబంధనల ప్రకారం పనులు జరుగుతున్నాయని, ప్రస్తుతం జరుగుతున్న విచారణకు పూర్తిగా సహకరిస్తామని నామా నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్