Friday, June 12, 2026
HomeTrending Newsటాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూ టి సి) ఫైనల్ మ్యాచ్ ఎట్టకేలకు మొదలు కానుంది. వర్షం కారణంగా మొదటి రోజు మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. సౌతాంప్టన్ లో నేడు వర్షం కాస్త తెరిపివ్వడంతో మ్యాచ్ మొదలు పెట్టాలని అధికారులు నిర్ణయించారు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు.

కాసేపట్లో శుభమన్ గిల్ తో కలిసి రోహిత్ శర్మ ఇండియా తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించనున్నాడు. వర్షం కారణంగా పిచ్ లో వచ్చే మార్పులకు అనుగుణంగా ఫైనల్ లెవెన్ లో మార్పులు ఉండొచ్చని వార్తలు వచ్చినా ఎలాంటి మార్పులు లేకుండానే మొన్న ప్రకటించిన తుది జట్టుతోనే ఇండియా బరిలోకి దిగుతోంది.

నిన్న ఆట రద్దు కావడంతో తీవ్రంగా నిరాశ చెందిన క్రీడాభిమానులు నేడు ప్రారంభం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ చారిత్రాత్మక మ్యాచ్ లో విజయంపై రెండు జట్లూ ధీమాగానే ఉన్నాయి. నిన్నటి నుంచి జూన్ 22 వరకూ ఐదు రోజులపాటు మ్యాచ్ జరగాల్సి ఉంది, నిన్న వృథా కావడంతో రిజర్వ్ డే గా ఉన్న 23 ను ఐదవ రోజుగా పరిగణిస్తారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది.

మరోవైపు సౌతాంప్టన్ లో మరో ఆరు రోజులపాటు వర్ష సూచన ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. దీంతో మ్యాచ్ తుదివరకూ సక్రమంగా జరిగేనా లేదా అనేది కూడా సంశయమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular