Thursday, June 11, 2026
Homeసినిమాఏజెంట్ సినిమా ఇప్పట్లో వస్తుందా?

ఏజెంట్ సినిమా ఇప్పట్లో వస్తుందా?

అక్కినేని అఖిల్ లేటెస్ట్ మూవీ ఏజెంట్. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమాను అనిల్ సుంక‌ర నిర్మిస్తున్నారు. మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర పోషిస్తున్నారు.  అఖిల్ ఈ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. అభిమానులు కూడా ఈ మూవీపై చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ సినిమా సెట్స్ పైకి వచ్చి చాలా కాలం అయినప్పటికీ ఇంకా విడుదల విషయంలో కన్ఫ్యూజనే ఉంది కానీ.. క్లారిటీ లేదు.  ఒక విధంగా నాగార్జున ఈ సినిమా విషయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు అనవసరంగా సినిమాను పాడు చేస్తున్నాయని టాక్ కూడా వినిపిస్తోంది. సినిమా మొదలు పెట్టినప్పుడు నుంచి కూడా నాగార్జున ప్రతి విషయంలో దర్శకుడు సురేందర్ రెడ్డికి సలహాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సినిమా షూటింగ్ ఎప్పటికప్పుడు పూర్తి అయిన తర్వాత ప్రత్యేకంగా ఆయన సన్నివేశాలను చూస్తున్నారట.

దాదాపు 30% సన్నివేశాలు నిర్మాతలు రీ షూట్ చేయడానికి రెడీ అయ్యారట. ఒక విధంగా దర్శకుడు సురేందర్ రెడ్డికి ఫ్రీడమ్ ఇస్తే అతను అనుకున్నట్లు చాలా మంచి సినిమాను తెర పైకి తీసుకురాగలడు కానీ.. నాగార్జున అనవసరంగా తన సలహాలతో సినిమాను పాడు చేస్తున్నారా అనే టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇక రీసెంట్ గా ది ఘోస్ట్ సినిమాతో ఆయన ప్రణాళికలు అన్నీ కూడా వృధా కావడంతో ఇప్పుడు ఏజెంట్ సినిమాలో కూడా అలాంటి తప్పులు జరగకూడదని మరింత ఎక్కువ సలహాలు కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నాగార్జున అభిమానులు టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. మ‌రి.. ఏజెంట్ ఏం చేస్తాడో..?  అఖిల్ కి ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుందో చూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular