Tuesday, January 21, 2025
Homeసినిమా‘లాల్ సింగ్ చద్దా’లో చైత‌న్య‌ పాత్ర పెంపు?

‘లాల్ సింగ్ చద్దా’లో చైత‌న్య‌ పాత్ర పెంపు?

Laal Singh Chaddha: యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య న‌టించిన ‘బంగార్రాజు’ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా త‌ర్వాత చైత‌న్య న‌టించిన ‘థ్యాంక్యూ’ మూవీ విడుద‌ల కానుంది. అలాగే చైత‌న్య బాలీవుడ్ లో న‌టించిన ఫ‌స్ట్ మూవీ ‘లాల్ సింగ్ చ‌ద్దా’. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తో క‌లిసి చైత‌న్య న‌టించారు.

ఈ సినిమా కోసం నాగ‌చైత‌న్య పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌డం జ‌రిగింది. క్రిస్మ‌స్ కి ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రావాలి కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డింది. ఆత‌ర్వాత ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ అనుకున్నారు. అది కూడా వాయిదా ప‌డింది. ఏప్రిల్ లో ఈ సినిమాని రిలీజ్ చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. అయితే.. ఈ సినిమా అవుట్ ఫుట్ చూసిన అమీర్ ఖాన్.. చైత‌న్య క్యారెక్ట‌ర్ త‌క్కువుగా ఉంది. ఇంకాస్త పెంచితే బాగుంటుంది అనుకున్నార‌ట‌.

త్వ‌ర‌లోనే అమీర్ ఖాన్, నాగ‌చైత‌న్య పై కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదే క‌నుక నిజ‌మైతే.. చైత‌న్య అభిమానులు మ‌రింత హ్యాపీగా ఫీల‌వుతారు అన‌డంలో సందేహం లేదు. మ‌రి.. బాలీవుడ్ లో చైత‌న్య ఎంత వ‌ర‌కు మెప్పిస్తాడో..?   ఎలాంటి ఆఫ‌ర్స్ ద‌క్కించుకుంటాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్