Thursday, March 28, 2024
Homeస్పోర్ట్స్ప్రొ కబడ్డీ: తలైవాస్ భారీ విజయం

ప్రొ కబడ్డీ: తలైవాస్ భారీ విజయం

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ నేటి మ్యాచ్ లలో తలైవాస్ ఘనవిజయం సాధించగా మరో మ్యాచ్  లో జైపూర్ గెలుపొందింది.

తమిల్ తలైవాస్- హర్యానా స్టీలర్స్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో 45-26 తో తమిళ్ జట్టు విజయం సాధించింది. తొలి అర్ధ భాగంలో 24-18తో ఆధిక్యం సంపాదించిన తలైవాస్ రెండో అర్ధభాగంలోనూ అదే జోరు కొనసాగించి పూణే 21-8తో పైచేయి కొనసాగించారు. మ్యాచ్ ముగిసే నాటికి 19 పాయింట్ల భారీ తేడాతో తమిళ్ గెలుపొందింది.  తలైవాస్ లో మన్ జీత్ 10; సుర్జీత్ సింగ్ 8 పాయింట్లు సాధించారు.

జైపూర్ పింక్ పాంథర్స్- దబాంగ్ ఢిల్లీ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో జైపూర్ 30-28 తేడాతో  రసవత్తర విజయాన్ని అందుకుంది. తొలి అర్ధ భాగంలో రెండు జట్లూ 12-12 తో సమంగా నిలిచాయి. రెండో అర్ధభాగంలోనూ పోరు హోరాహోరీగా సాగింది. చివర్లో జైపూర్ సత్తా చాటి 18-16తో ద్వితీయార్ధంలో రెండు పాయింట్ల ఆధిక్యం సంపాదించి విజయం సాధించింది.

నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత దబాంగ్ ఢిల్లీ (32 పాయింట్లు); పాట్నా పైరేట్స్ (29); బెంగుళూరు బుల్స్ (28); తమిళ్ తలైవాస్ (27); యూ ముంబా(25); జైపూర్ పింక్ పాంథర్స్ (23) జట్లు టాప్ సిక్స్ లో ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్