అక్కినేని నాగ‌చైత‌న్య ‘థ్యాంక్యూ’ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కిన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. నాగ‌చైత‌న్య కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఇది నాగ‌చైత‌న్య‌, దిల్ రాజుల‌కు పెద్ద షాక్ అని చెప్ప‌చ్చు. ఈ సినిమా త‌ర్వాత నాగ‌చైత‌న్య న‌టించిన బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చ‌డ్డా రిలీజైంది. ఇది నాగ‌చైత‌న్య ఫ‌స్ట్ బాలీవుడ్ మూవీ.

అమీర్ ఖాన్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద  నిరాశ‌ప‌రిచింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ఎదురవుతుండటంతో నాగచైతన్య టెన్ష‌న్ ప‌డుతున్నాడ‌ట. అంగీకరించిన ప్రాజెక్ట్ లని ముందుకు తీసుకెళ్లాలా? వ‌ద్దా..? అని ఏదీ సరిగ్గా తేల్చుకోలేక పోతున్నాడట. ప్రస్తుతం విక్రమ్ కుమార్ తో ధూత అనే వెబ్ సిరీస్ చేస్తున్న నాగ చైతన్య దీనితో పాటు తమిళ దర్శకుడు వెంక‌ట్ ప్రభుతో ఓ బైలింగ్వల్ చేయబోతున్నాడు.

ఈ సినిమా త‌ర్వాత చైత‌న్య వ‌రుసగా సినిమాలు చేయాలని పరశురామ్, తరుణ్ భాస్కర్, నందినిరెడ్డి, బొమ్మరిల్లు భాస్కర్ లతో చర్చలు జరిపాడు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం వీరందరితో చర్చలని హోల్డ్ లో పెట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. చైతూ తాజా నిర్ణయం పరశురామ్, తరుణ్ భాస్కర్, నందినిరెడ్డి, బొమ్మరిల్లు భాస్కర్ లకు బిగ్ షాకే అని చెప్ప‌చ్చు. మ‌రి.. చైతు ఈ ద‌ర్శ‌కుల్లో ఎవరితో సినిమాకి ఓకే చెబుతాడో చూడాలి.

Also Read: ఆలోచ‌న‌లో ప‌డ్డ నాగ‌చైత‌న్య‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *