Wednesday, May 7, 2025
Homeసినిమానాగ చైతన్య- శోభిత నిశ్చితార్ధం : నాగార్జున సంతోషం

నాగ చైతన్య- శోభిత నిశ్చితార్ధం : నాగార్జున సంతోషం

అక్కినేని నాగచైతన్య- శోభిత ధూళిపాళ్ల వివాహ నిశ్చితార్ధం కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. నాగచైతన్య తండ్రి, హీరో నాగార్జున ఈ వేడుకపై తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకొని ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు.

“ఈ రోజు ఉదయం 9:42 గంటలకు మా అబ్బాయి నాగ చైతన్య నిశ్చితార్థం శోభిత ధూళిపాళతో జరిగినట్లు ప్రకటిస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది,  ఆమెను మా కుటుంబంలోకి సాదరంగా స్వాగతిస్తున్నాం. నూతన జంటకు అభినందనలు! వారు కలకాలం ప్రేమ, సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను.  దేవుడు ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నా” అంటూ ట్వీట్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్