Monday, June 15, 2026
Homeసినిమానాగ శౌర్య కొత్త చిత్రం ప్రారంభం

నాగ శౌర్య కొత్త చిత్రం ప్రారంభం

మంచి అభిరుచి గల నిర్మాతగా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్ పై పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లని సుధాకర్ చెరుకూరి నిర్మించారు.  నాగశౌర్య కథానాయకుడిగా, పవన్ బాసంశెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ నూతన చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. ముహూర్తం షాట్‌కు లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు క్లాప్‌బోర్డ్‌ కొట్టి స్క్రిప్ట్‌ను అందజేశారు. నాని ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచాన్ చేశారు.

ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రం యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌లో నాగ శౌర్యకు వున్న క్రేజ్ కి తగినట్లు ఫన్-ఫిల్డ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వుండబోతుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నాగశౌర్యకు జోడీగా యుక్తి తరేజా నటిస్తోంది. నాగ చైతన్య లవ్ స్టోరీకి అద్భుతమైన ఆల్బమ్ అందించిన ఏఆర్ రెహమాన్ శిష్యుడు పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular