Saturday, June 13, 2026
Homeసినిమానాగ శౌర్య కొత్త చిత్రం ప్రారంభం

నాగ శౌర్య కొత్త చిత్రం ప్రారంభం

నాగశౌర్య 24వ చిత్రానికి నూతన దర్శకుడు ఎస్ఎస్ అరుణాచలమ్ దర్శకత్వం వహిస్తున్నారు. వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌ పై ప్రొడక్షన్ నెం 1గా శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డా. అశోక్ కుమార్ చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బేబీ అద్వైత, భవిష్య ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. #NS24 విశిష్ట అతిథుల సమక్షంలో గ్రాండ్ గా ప్రారంభమైయింది. పూజా కార్యక్రమానికి విచ్చేసిన దర్శకుడు వివి వినాయక్ ముహూర్తం షాట్‌ కు క్లాప్‌ బోర్డ్‌ ను ఇచ్చారు. అభిషేక్ అగర్వాల్ కెమెరా స్విచాన్ చేయగా, తొలి షాట్ కి తిరుమల కిషోర్ దర్శకత్వం వహించారు. న్యూరో హాస్పిటల్ సాంబశివారెడ్డి, జి.ఎస్.కె ఇన్‌ఫ్రా టెక్ సంతోష్ కుమార్ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అందజేశారు.

#NS24లో కీలక పాత్రల్లోప్రముఖ తారాగణం కనిపించనుంది. అలాగే ఈ సినిమా కోసం అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేయనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ చాలా గ్యాప్ తర్వాత తెలుగు ఈ చిత్రానికి సంగీతం అందించడం విశేషం. వెట్రి పళనిసామి సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా, సాయి ప్రవీణ్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular