Friday, March 29, 2024
HomeTrending Newsయూ ట్యూబ్‌ క్లాసులతో ... నీట్ లో మెరిసిన హారిక

యూ ట్యూబ్‌ క్లాసులతో … నీట్ లో మెరిసిన హారిక

యూ ట్యూబ్‌లో వీడియో క్లాసులు చూసి ఇందూరుకు చెందిన ఓ స్టూడెంట్‌ ఎంబీబీఎస్ ర్యాంక్ సాధించింది. నిజామాబాద్‌లోని నాందేవ్‌వాడకు చెందిన సతీశ్‌కుమార్, అనురాధలకు హారిక, ఈశ్వర్‌ పిల్లలు. వీరి తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి బీడీ కార్మికురాలిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కూతురు హారిక పదో తరగతి, ఇంటర్​మీడియట్​ పరీక్షల్లో మంచి ​మార్కులు సాధించింది.

డాక్టర్‌‌ కావాలన్న కోరిక ఉన్నా నీట్ ​కోచింగ్​కు వెళ్లే స్థోమత లేదు. అయినా వెనుకడుగు వేయలేదు. ప్రతిరోజూ యూట్యూబ్‌లో వీడియో క్లాసులు చూసి  పరీక్షలకు సిద్ధమైంది. ఈ సంవత్సరం నిర్వహించిన నీట్ ఎగ్జామ్‌లో  ఆలిండియా స్థాయిలో  40 వేల ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 700 ర్యాంక్‌ సాధించింది. కాలేజీలో సీటు వచ్చినా ఫీజు, హాస్టల్, బుక్స్ ఫీజులు కలిపి కనీసం రూ.రెండు లక్షల వరకు కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఈ డబ్బులు లేకపోవడంతో చదువుకు దూరమవుతానేమోనని ఆవేదన చెందుతోంది. తాను ఎంబీబీఎస్​ చదివేందుకు దాతలు ఆర్థిక సాయం అందించాలని వేడుకుంటోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్