టాలీవుడ్ కింగ్ నాగార్జున-ప్ర‌వీణ్ స‌త్తారు కాంబినేషన్ లో రూపొందిన ది ఘోస్ట్ మూవీ ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. ఇదిలా ఉంటే.. నాగార్జున‌.. నాగ‌చైత‌న్య‌తో క‌లిసి నటించిన  బంగార్రాజు సినిమా సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ సాధించింది.

అఖిల్ తో కూడా నాగార్జున‌ ఓ సినిమా చేయ‌నున్నార‌ని.. దీనికి మోహ‌నరాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. ప్ర‌చారంలో ఉన్న వార్త వాస్త‌వ‌మేనా..?  కాదా..? అనే అనుమానం ఉండేది. ది ఘోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున అఖిల్ తో సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు.

ఇంత‌కీ నాగార్జున ఏం చెప్పారంటే… “ఇంత మంది అభిమానుల‌ను చూస్తుంటే.. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున ఈ వేదిక పై నేను .. చైతూ .. అఖిల్ ఇంతటి ప్రేమను అందుకుంటున్నందుకు   ఇద్దరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒకటి తెలుగు సినిమా పరిశ్రమ అయితే రెండవది మా నాన్నగారు. ఇక నేను చైత‌న్య‌తో చేసిన బంగార్రాజు కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. టీవీల్లో ఆ సినిమాకి వచ్చిన టీఆర్పీలు ఈ ఏడాదిలో ఇంత వరకూ ఏ సినిమాకీ రాలేదు. నెక్స్ట్ అఖిల్ తో సినిమా చేయబోతున్నాను. ఏజెంట్, ఘోస్ట్ కలిస్తే ఎలా ఉంటుందో .. ఆ సినిమా అలా ఉంటుంద”ని చెప్పారు. ఈ విధంగా అఖిల్ తో చేయ‌నున్న సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు నాగార్జున‌. మ‌రి.. ఈ సినిమా ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తుందో చూడాలి.

Also Read చిరు వర్సెస్ నాగార్జున‌ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *