Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

తెలంగాణ లోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ పరిశ్రమను విస్తరించాలన్నది తెలంగాణ ప్రభుత్వం విధానమని ఐటి శాఖ మంత్రి కే తారక రామా రావు వెల్లడించారు. ఆదిలాబాద్ లాంటి మారుమూల ప్రాంతంలో ఒక ఐటీ కంపెనీ రావడం చాలా సంతోషకరమన్నారు. ఆదిలాబాద్ లోని BDNT LAB ను ఈ రోజు సందర్శించిన ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్ర రెడ్డి, ఇంద్ర కరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లడుతూ NTT, BDNT LAB ను ఆదిలాబాద్ లో ఏర్పాటుచేసిన సంజయ్ దేశపాండే కు ధన్యవాదాలు దేలిపారు. ఒకప్పుడు ఆదిలాబాద్ అంటే అభివృద్దికి ఆమడదూరంలో ఉండేది. కాని ఆదిలాబాద్ ను కూడా ఐటీ మ్యాప్ లో పెట్టిన సిఎం కేసీఆర్  విజన్ కు ధన్యవాదాలు తెలిపారు.

మంత్రి కేటిఆర్ ప్రసంగంలో ముఖ్యాంశాలు…
సిఎం కేసీఆర్ దార్శనికతతో వరంగల్, కరీంనగర్,మహబూబ్ నగర్, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్ లాంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ఐటీ కంపెనీలు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని యువతకు అవకాశాలు కల్పిస్తే హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రాంతాలతో పోటీ పడతారు. వరంగల్, కరీంనగర్,మహబూబ్ నగర్, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్ లాంటి పట్టణాల్లో ఐటీ పరిశ్రమలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఉన్నాయి. పట్టుదల ఉంటే ఎవరికీ తీసిపోకుండా విజయం సాధిస్తారు. NTT, BDNT LAB లో పనిచేస్తున్న వాళ్లంతా ఆదిలాబాద్ స్థానికులే. ఇక్కడ ఉండే వీళ్లంతా అమెరికా తో పాటు ఎన్నో దేశాల అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేయడం సంతోషం. విద్యుత్ సరాఫరాను మరింత మెరుగురిచేందుకు డెడికేటెడ్ ట్రాన్స్ ఫార్మర్ కావాలన్నారు. తాత్కాలిక బిల్డింగ్ ఇది. దీన్ని ఇంకొంచెం ఆధునీకరించాలని ఉద్యోగులు కోరారు. కలెక్టర్, మున్సిపల్ ఛైర్మెన్ గారికి కోటిన్నర రూపాయలను సాయంత్రం వరకు మంజూరు చేయిస్తా. ఆధునీకరణ పనులను ప్రభుత్వ పరంగా ఉచితంగా చేయిస్తాం. ఇక్కడ కంపెనీ స్థాపించడమే ఈ యాజమాన్యం మనకు చేసిన అతి పెద్ద సహాయం. వీళ్లను చూసి మిగతా వారు రావాలన్నది ప్రభుత్వ ఆశ. కలెక్టర్ ఈ పనులు చేయిస్తారు.


గతంలో ఆదిలాబాద్ లో సిసిఐ ఉండేది. దాన్ని తిరిగి తెరిపించేందుకు చాలా ప్రయత్నాలు చేసినం. కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి కోరాము. కొత్త యూనిట్ పెడితే ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తారో అవన్నీ ఇస్తాం అని కూడా చెప్పినం. రాష్ట్రంలో నిర్మాణ రంగం అద్భుతంగా పురోగమిస్తోంది. ప్రైవేటు కంపెనీలు లాభాలు ఆర్జిస్తున్నాయి. మరి ప్రభుత్వ సంస్థ ఎందుకు లాభం సంపాదించదు? రాష్ట్ర ప్రభుత్వం ఏదంటే అది ఇవ్వడానికి సిద్దంగా ఉంది. జోగురామన్న నాయకత్వంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఉధ్యమం చేసింది. కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జోగురామన్నఐటీ పార్క్ ఏర్పాటు చేయాలని అడిగారు. ఆయన విజ్ఞప్తిమేరకు ఐదు ఎకరాల స్థలంలో ఐటీ పార్క్ కు త్వరలోనే శంఖుస్థాపన చేస్తాం. విదేశాల్లో ఉన్న పూర్వ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన భూమి పుత్రులు కూడా ముందుకు రావాలి. అన్ని రకాల ప్రోత్సాహకాలు ఇస్తాము. ఇక్కడ ఏర్పాటుచేయబోతున్న ఐటీ పార్క్ లో కంపెనీలు ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

పూర్వ ఆదిలాబాద్ జిల్లా కశ్మీర్ ఆఫ్ తెలంగాణ. పూర్వ ఆదిలాబాద్ జిల్లా ఉన్నంత అందంగా తెలంగాణలో ఏ జిల్లా ఉండదు. గుట్టలు, వాగులు, వంకలు, పచ్చని మైదనాలు జలపాతాలు, జోడేఘాట్, కొమ్రం భీం, అద్భుతమైన సాంస్కృతిక సంపద ఇక్కడ ఉన్నాయి. హైదరాబాద్ లో ఉన్నవాళ్లకు మంచి టూరిజం డెస్టినేషన్ ఇది. పూర్వ ఆదిలాబాద్ జిల్లాలోని అందమైన ప్రదేశాలను ప్రమోట్ చెయ్యాలని టూరిజం మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆదిలాబాద్ లో టూరిజం ప్రమోట్ చెయ్యాలి. హైదరాబాద్ నుంచి వికెండ్ లో టూరిస్టులు వచ్చే అవకాశం ఉంది. టూరిజం మినిస్టర్ ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. NTT, BDNT LAB లో ఆధునీకరణ పనులకు ప్రభుత్వం నిధులు ఇస్తుంది. కలెక్టర్ గారు ఈ పనులను పూర్తి చేయ్యాలని మంత్రి కేటిఆర్ అన్నారు.

Also Read తెలంగాణ పురపాలికలకు అవార్డుల పంట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com