నాగార్జున ఇటీవల వైల్డ్ డాగ్, ది ఘోస్ట్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు చిత్రాలు యాక్షన్ మూవీస్. ఇవి ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. ఈ రెండు చిత్రాల మధ్యలో వచ్చిన ‘బంగార్రాజు’ చిత్రం మాత్రం అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని నాగార్జునకు మంచి విజయాన్ని అందించింది. దీంతో నెక్ట్స్ మూవీ విషయంలో బాగా ఆలోచించి యాక్షన్ మూవీ కాకుండా ఎంటర్ టైన్మెంట్ మూవీ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈసారి రైటర్ బెజవాడ ప్రసన్నకుమార్ కు నాగ్ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు.
మలయాళంలో విజయం సాధించిన ‘పొరింజు మరియం జోస్’ మూవీ నాగార్జునకు బాగా నచ్చడంతో ఈసారి ఈ మూవీని రీమేక్ చేయనున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశారు. ఇందులో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించనున్నారని సమాచారం. ఈ భారీ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరిలోనే ఈ సినిమా షూటింగ్ చేయనున్నట్టుగా ప్రచారం జరిగింది కానీ.. ఎలాంటి అప్ డేట్ రాలేదు.
దీంతో నాగ్ నెక్ట్స్ మూవీ ఎప్పుడు..? అంటూ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజా వార్త ఏంటంటే.. ఉగాదికి ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. దీనికి సంబంధించిన వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యిందని సమాచారం. ఇందులో నాగార్జున రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారని.. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయని తెలిసింది. దీంతో ఈసారి హిట్టు పక్కా అని అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేస్తారో.. సంక్రాంతికి రిలీజ్ చేస్తారో తెలియాల్సివుంది.