Thursday, March 19, 2026
Homeసినిమాఅక్టోబ‌ర్ 5న నాగ్ 'ది ఘోస్ట్' విడుద‌ల‌

అక్టోబ‌ర్ 5న నాగ్ ‘ది ఘోస్ట్’ విడుద‌ల‌

Ghost: కింగ్ అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ‘ద ఘోస్ట్. ఈ చిత్రం కింగ్ మేకర్స్ కిల్లింగ్ మెషిన్‌తో ప్రమోషన్స్ ను ప్రారంభించారు. ఈ మూవీ నుంచి టీజ‌ర్ రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున అత్యంత శిక్షణ పొందిన, అత్యంత ప్రాణాంతకమైన ఏజెంట్‌కు కోపం వచ్చినప్పుడు, అతను ఆపలేని కిల్లింగ్ మెషిన్ అవుతాడు అనేలా చూపించారు. నాగార్జున బ్యాడ్‌డాస్‌గా కనిపించడంతోపాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేలా ఉంది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ మినహా దాదాపు పూర్తి కావచ్చింది.

దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తామని గ్లింప్స్ ద్వారా మేకర్స్ ప్రకటించారు. నాగార్జున కల్ట్ క్లాసిక్ మరియు పాత్ బ్రేకింగ్ మూవీ శివ కూడా 1989లో అదే తేదీన విడుదలైంది. నాగార్జున ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా కనిపించనున్న ఈ సినిమాలో ఆయన సరసన సోనాల్ చౌహాన్ నటిస్తోంది. ప్రవీణ్ సత్తారు ఈ చిత్రాన్ని అన్ని కమర్షియల్ హంగులతో హై ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular