Monday, May 20, 2024
Homeసినిమా‘నల్లమల’ వండ‌ర్స్ క్రియేట్ చేస్తుంద‌ని న‌మ్ముతున్నా: దేవా క‌ట్టా

‘నల్లమల’ వండ‌ర్స్ క్రియేట్ చేస్తుంద‌ని న‌మ్ముతున్నా: దేవా క‌ట్టా

నల్లమల అడవి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటికి భిన్నంగా ఆ అడవి చుట్టూ జరిగిన ఎన్నో చీకటి కోణాలను, సామాన్య జనానికి తెలియని అవినీతి ఒప్పందాల నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర క‌థా క‌థ‌నాల‌తో తెర‌కెక్కుతోన్న చిత్రం `న‌ల్ల‌మ‌ల‌`. అమిత్‌ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ద్వారా రవి చరణ్ ‌దర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఆర్‌.ఎమ్‌ నిర్మిస్తున్న ఈ మూవీలోని సిద్ శ్రీ‌రామ్ పాడిన ‘ఏమున్న‌వే’ పిల్లా సాంగ్ మిలియ‌న్స్ కి పైగా వ్యూస్ సాధించి సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా ఆ పాట‌కు ల‌క్ష‌కు పైగా క‌వ‌ర్‌సాంగ్స్ రావ‌డం విశేషం. అలాగే ఈ చిత్రం నుండి విడుద‌లైన అన్ని పాట‌లు మిలియ‌న్ల వ్యూస్ సాధించ‌డం ఆడియ‌న్స్  లో ఈ సినిమా క్రేజ్‌ను తెలియ‌జేస్తున్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు దేవా కట్టా విడుదల చేశారు.

హీరోయిన్ భాను శ్రీ‌ మాట్లాడుతూ “టీజర్ అద్భుతంగా ఉంది. నల్లమల సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన పాట చాలా పెద్ద హిట్ అయింది. ఎక్కడికి వెళ్లినా ఆ పాటతోనే నన్ను గుర్తిస్తున్నారు. మా టీజర్‌ను విడుదల చేసినందుకు దేవా కట్టా గారికి థ్యాంక్స్. ఈ సినిమా కోసం మా డైరెక్టర్ గారు చాలా కష్టపడ్డారు. ఈ మూవీ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్” అన్నారు.

ద‌ర్శ‌కుడు రవి చరణ్ మాట్లాడుతూ “నాతో ఈ సినిమా చేసినందుకు, నేను ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడేలా చేసిన నిర్మాత ఆర్ఎమ్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నాకు దేవా కట్టా గారంటే చాలా ఇష్టం. టీజర్ రిలీజ్ చేసినందుకు థ్యాంక్స్. సినిమా గురించి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఓ రెండు విషయాలు చెబుతాను. అడవిని అడవి తల్లి.. గోవును గోమాత అని అంటాం. బానిస బతుకుల నుంచి భారతదేశం స్వేచ్చావాయువును పీల్చుకుంటున్న సమయంలో నల్లమల అడవుల్లోకి మానవ రూపంలో ఉన్న క్రూరమృగం ఎంట్రీ అయింది. ఆ మృగం ఎంట్రీ అయ్యాక ఏం జరిగింది అనేదే ఈ కథ. తరువాత సినిమా గురించి చాలా విషయాలు చెబుతాను. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్” అన్నారు.

దేవాకట్టా మాట్లాడుతూ “ఇక్కడకి వచ్చినందుకు ఎంతో గౌరవంగా ఫీలవుతున్నాను. ‘ఏమున్నావే పిల్ల‌’ పాటను నేను నా ఫ్రెండ్స్‌ తో హ్యాంగవుట్‌లో ఉంటే వింటాను. ఇలాంటి పాట నాకు ఒక్కటి కూడా లేదని అసూయ పడ్డాను. ఇంత మంచి క్యాస్టింగ్‌ను పెట్టుకోవడంతోనే సినిమా సక్సెస్‌కు మొదటి మెట్టు పడ్డట్టు అయింది. టీంను చూస్తుంటే పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. నేను మిమ్మల్ని ఆశీర్వదించాల్సిన అవసరం లేదు. మీ పాజిటివిటీనే నేను తీసుకోవాలనేట్టు ఉంది. ఈ సినిమా వండ‌ర్స్ క్రియేట్ చేస్తుంద‌ని న‌మ్ముతున్నాను. నన్ను ఇక్కడికి పిలిచినందుకు థ్యాంక్స్. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్‌” అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్