Friday, October 18, 2024
HomeTrending NewsInfosys:ఐఐటీ బాంబేకు నంద‌న్ నిలేక‌ని 315 కోట్లు విరాళం

Infosys:ఐఐటీ బాంబేకు నంద‌న్ నిలేక‌ని 315 కోట్లు విరాళం

ఇన్‌ఫోసిస్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌న్ నిలేక‌ని .. ఐఐటీ బాంబేకు చెందిన పూర్వ విద్యార్థుల గ్రూపున‌కు 315 కోట్లు విరాళం ఇచ్చారు. ఐఐటీ బాంబే 50 ఏళ్ల వేడుక‌ల్ని నిర్వ‌హిస్తున్న సంద‌ర్భంగా ఆయ‌న ఈ విరాళం ప్ర‌క‌టించారు. 1973లో ఐఐటీ బాంబేలో ఆయ‌న ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేశారు. త‌న విరాళంతో ఆ విద్యా సంస్థ‌లో ప్ర‌పంచ స్థాయి మౌళిక స‌దుపాయాలు క‌ల్పించ‌నున్న‌ట్లు చెప్పారు. ఇంజినీరింగ్‌, టెక్నాల‌జీ రంగాల్లో ప‌రిశోధ‌న‌లు పెంచ‌నున్న‌ట్లు చెప్పారు. టెక్నాల‌జీ స్టార్ట‌ప్ ఎకోసిస్ట‌మ్‌ను డెవ‌ల‌ప్ చేయ‌నున్న‌ట్లు ఓ ప్ర‌క‌ట‌లో వెల్ల‌డించారు.

ఐఐటీ బాంబే త‌న జీవితంలో ఓ కీల‌క‌మైంద‌ని, త‌న భ‌విష్య‌త్తును తీర్చిదిద్దింద‌ని, నా భ‌విష్య‌త్తుకు ఫౌండేష‌న్ వేసింద‌ని, ఆ ప్ర‌ఖ్యాత విద్యా సంస్థ‌తో 50 ఏళ్ల అనుబంధం ఏర్ప‌డింద‌ని, ఆ సంస్థ భ‌విష్య‌త్తుకు తోచిన రీతిలో స‌హాయం చేయ‌ద‌లుచుకున్నాన‌ని నంద‌న్ నిలేక‌ని త‌న రిలీజ్‌లో తెలిపారు. గ‌తంలోనూ ఐఐటీ బాంబేకు నిలేక‌ని 85 కోట్లు డోనేట్ చేశారు. దీంతో ఆయ‌న మొత్తం కాంట్రిబ్యూష‌న్ 400 కోట్ల‌కు చేరింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్