Saturday, January 18, 2025
Homeసినిమా'హిట్ 3' పై దృష్టి పెట్టిన నాని!

‘హిట్ 3’ పై దృష్టి పెట్టిన నాని!

నాని ఒక వైపున వరుస సినిమాలు చేస్తూనే, మరో వైపున ఒక దాని తరువాత ఒకటిగా నిర్మాతగా సొంత బ్యానర్ పై సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ఓ మాదిరి బడ్జెట్ లో .. ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. నిర్మాతగా నాని సినిమా అంటే, కంటెంట్ లో ఏదో విషయం ఉంటుంది అనే ఒక నమ్మకాన్ని ఆయన ఆడియన్స్ కి కలిగించాడు. అలా ఆయన బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలలో ‘హిట్’ ఒకటి.

విష్వక్సేన్ హీరోగా శైలేశ్ కొలను దర్శకత్వంలో 2020లో వచ్చిన ఈ సినిమా, ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసిన తరువాత ఈ పోలీస్ డ్రామాను ఆధారంగా చేసుకుని సీక్వెల్స్ ను వదలాలని నిర్ణయించుకున్నారు. అలా వచ్చిన ‘హిట్ 2’ కూడా విజయాన్ని సాధించింది. అడివి శేష్ హీరోగా చేసిన ఈ సినిమా కూడా నానీకి మంచి లాభాలను తెచ్చి పెట్టింది.

ఇక ఇప్పుడు ‘హిట్ 3’ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకుని వెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో నాని హీరోగా చేయనున్నాడనే విషయానికి సంబంధించిన హింట్ ను ‘పార్టు ‘లోనే ఇచ్చారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగు మొదలుకానున్నట్టు తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావలసి ఉంది. ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడనే విషయం తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్