Saturday, June 13, 2026
Homeసినిమానాని ‘దసరా’ క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభం

నాని ‘దసరా’ క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభం

నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్  మూవీ ‘దసరా’ ఫస్ట్‌ లుక్‌ నుండి ఇటీవలే విడుదలైన ఫస్ట్‌ సాంగ్‌ ‘ధూమ్‌ ధామ్‌’ వరకు అద్భుతమైన రెస్పాన్స్‌ తో సినిమాపై క్యూరియాసిటీ ని పెంచేసింది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ గోదావరిఖని బొగ్గు గని సెట్‌లో ఈ రోజు ప్రారంభమైంది. పదిహేను రోజుల షెడ్యూల్‌ లో కీలకమైన క్లైమాక్స్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారు. దీన్ని అప్‌డేట్ చేస్తూ నాని ఇన్‌స్టాగ్రామ్‌ లో  లొకేషన్ ఫోటో ని పోస్ట్ చేసి “చివరి షెడ్యూల్‌ లో మొదటి రోజు. మనస్సు, శరీరం, హృదయం, ఆవేశం దాని పూర్తి సామర్థ్యంతో” అని రాశారు.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌ పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. జాతీయ అవార్డు  విన్నర్ కీర్తి సురేష్ ఈ సినిమాలో నానికి జోడిగా కనిపించనుంది. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌ గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు. దసరా చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 30 మార్చి 2023న విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular