Thursday, April 18, 2024
Homeసినిమా'శాసనసభ' నుంచి 'నన్నుపట్టుకుంటే' లిరికల్‌ వీడియో

‘శాసనసభ’ నుంచి ‘నన్నుపట్టుకుంటే’ లిరికల్‌ వీడియో

కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలతో సంగీత దర్శకుడిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రవిబసుర్.ఇక కేజీఎఫ్-2 తరువాత రవిబసుర్ సంగీతం అందిస్తున్న మరో పాన్‌ఇండియా చిత్రం ‘శాసనసభ’. ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకుడు.

తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పనిలు సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రత్యేక పాటను విడుదల చేసింది చిత్రబృందం. హెబ్బాపటలే్‌ నటించిన ఈ ఐటమ్‌సాంగ్‌ను ప్రముఖ గాయనీ మంగ్లీ ఆలపించారు. ఈ చిత్రం విశేషాలను నిర్మాత షణ్ముగం సాప్పని తెలియజేస్తూ… పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ఇది. యూనివర్శల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి రవిబసుర్ అందిస్తున్న సంగీతం, నేపథ్యసంగీతం మెయిన్‌పిల్లర్‌గా వుంటుంది. ఆయనతో పనిచేయడం ఎంతో గర్వంగా వుంది.

శాసనసభ విషయంలో ఆయన చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధతో ఎంతో అద్బుతంగా అవుట్‌పుట్ వచ్చింది.కేజీఎఫ్-2 తరువాత తెలుగులో ఆయన నుంచి వస్తున్న చిత్రమిది. హెబ్బాపటేల్‌ ప్రత్యేకపాట చిత్రంలో ఎంతో కలర్‌ఫుల్‌గా వుంటుంది. ఈ పాటకు మంచి స్పందన వచ్చింది. త్వరలో చిత్ర ట్రైలర్‌ను విడుదల చేస్తాం. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తాం’ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్