ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు యువతకు అయన శుభాకాంక్షలు తెలియజేశారు.
ట్విట్టర్ లో అయన స్పందిస్తూ “ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు యువతకు అంతర్జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగుదేశం పాలనలో తెలుగు యువత ఎన్నో అద్భుత అవకాశాలను అందుకుంది. దేశ విదేశాల్లో తన సత్తా చాటింది. అలాంటి యువశక్తిని రెండేళ్ళ @ysjagan పాలన తీవ్రంగా నిరుత్సాహపరిచింది. మాస్క్ పెట్టుకోలేదని ఒకరిని, దొంగతనం ఒప్పుకోలేదని ఒకరిని, జగన్ రెడ్డిని ప్రశ్నించాడని ఒకరిని ఈ ప్రభుత్వం బలితీసుకుంది. ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంటే తట్టుకోలేని యువత ఆత్మహత్యలు చేసుకుంటోంది. ఉద్యోగాలు లేక బతుకు మీది భయంతో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. యువ ముఖ్యమంత్రి అని ఆశపడిన యువతకు బతుకులేకుండా చేస్తున్నారు. ఇప్పటికైనా యువతకు ఇచ్చిన హామీలు చిత్తశుద్ధితో అమలు చెయ్యాలి” అంటూ ట్వీట్ చేశారు.

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.