నర్సాపురం ఎంపి కనుమూరు రఘురామ కృష్ణంరాజుకి ఈనెల 28వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ గుంటూరు సిఐడి కోర్టు తీర్పు ఇచ్చింది. ఆయనకు ప్రస్తుతం వున్నా వై కేటగిరీ సెక్యూరిటీ కొనసాగించాలని ఆదేశించింది. రఘురామకు తగిలిన గాయాలపై నివేదిక ఇవ్వాలని కోరింది. ముందుగా గుంటూరులోని జిజిహెచ్ కు, తరువాత రమేష్ ఆస్పత్రికి తరలించి వైద్య పరిక్షలు నిర్వహించి రెండు ఆస్పత్రుల డాక్టర్లు నివేదికలు ఇవ్వాలని తీర్పులో పేర్కొంది. రఘురామ కృష్ణం రాజు ఆరోగ్యం మెరుగు పడేంత వరకూ జైలుకు తరలించోద్దని కోర్టు ఆదేశించింది.
మరోవైపు రఘురామ రాజుపై మోపిన అభియోగాలను సవాల్ చేస్తూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. ఈ విచారణ కోసం జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ లలిత లతో కూడిన బెంచ్ ను హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి ఏర్పాటు చేశారు. ఎంపి కాలికి అయిన గాయాలపై మెడికల్ కమిటీ ని నియమించింది హైకోర్టు. రేపు ఉదయం10.30 గంటల లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.