Saturday, November 23, 2024
HomeTrending Newsహైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోడీ

హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోడీ

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఆయనకు గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసానిశ్రీనివాస్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, విజయశాంతి, ఈటల రాజేందర్, వివేక్ వెంకట స్వామి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో హెచ్ఐసీసీ నోవాటెల్ కు మోడీ వెళ్లారు. ఈ నేపథ్యంలో నోవాటెల్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం  4 గంటల వరకు మోడీ అక్కడే విశాంత్రి తీసుకుంటారు. ఆ తర్వాత రాత్రి 9 గంటల వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్​ కు చేరుకున్న వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్​ చేశారు. “డైనమిక్​ సిటీ హైదరాబాద్​ లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చాను. ఈ భేటీలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తాం” అని ఆయన వెల్లడించారు. ఈ ట్వీట్​ కు గవర్నర్​ తమిళిసై, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​, బీజేపీ ముఖ్య నేతలు స్వాగతం పలుకుతున్న రెండు ఫొటోలను జతచేశారు.

అంతకు ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పార్టీ నేతలు స్వాగతం పలికారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్