నరేశ్ – పవిత్ర లోకేశ్ జంటగా ‘మళ్లీ పెళ్లి’ సినిమా రూపొందింది. తన సొంత బ్యానర్ పై నరేశ్ నిర్మించిన సినిమా ఇది. ఎమ్మెస్ రాజు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. కొంతకాలంగా నరేశ్ – పవిత్రలోకేశ్ మీడియాలో నానుతూనే వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ద్వారా నరేశ్ ఏదో చెప్పాలనుకుంటున్నారనే విషయం చాలామందికి అర్థమైంది. ఆ రకంగా కూడా ఈ సినిమాపై ఆసక్తిని చూపిస్తున్నవారి సంఖ్య  కనిపిస్తోంది.

నరేశ్ లైఫ్ లో ఇటీవల కాలంలో చోటుచేసుకున్న సంఘటనలు జనాలు ఇంకా మరిచిపోలేదు. ఈ వేడి మీదే నరేశ్ ఇప్పుడు ఈ సినిమాను ఈ నెల 26వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాదులో జరిగింది. నరేశ్ కి దూరపు బంధువుగా .. ఈ సినిమాలో కీలకమైన పాత్రను చేసిన ఆర్టిస్టుగా జయసుధ ముఖ్య అతిథి స్థానంలో ఈవెంటుకి వచ్చారు. ఈ వేదికపై జయసుధ .. నరేశ్ .. పవిత్ర లోకేశ్ ముగ్గురూ కూడా అర్ధమయ్యి కానట్టుగా మాట్లాడారు.

జీవితంలో ఎవరి పోరాటం వారు చేయవలసిందే. మనకి నచ్చినట్టుగా బ్రతకాలంటే భయపడకూడదు అనే అర్థంలో పరోక్షంగా ఆమె నరేశ్ ను సమర్ధిస్తూ మాట్లాడారు. ఇక నరేశ్ కొంతవరకూ పరోక్షంగా మాట్లాడినా, చివరికి అసలు మేటర్ లోకి రాక తప్పలేదు. రీల్ లైఫ్ హ్యాపీగానే గడిచిందిగానీ .. రియల్ లైఫ్ మాత్రం అలా గడవలేదని మనసులో మాట చెప్పారు. తన గురించి తన తల్లి చాలా బాధపడిందనీ, ఆమెతో తన నిర్ణయం చెప్పి ఆశీస్సులు అందుకున్నానని అన్నారు.  ఇక పవిత్ర మాట్లాడుతూ తాను కట్టుకున్న కలల సౌధాన్ని కొన్ని దుష్టశక్తులు బ్రేక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు,  ఒక శక్తిలా నరేశ్ తన వెంట నిలబడ్డారని అంటూ, ఇక కలిసి కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నట్టుగా చెప్పేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *