జన ఆశీర్వాద యాత్రలో భాగంగా భువనగిరి పట్టణానికి చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. హుజురాబాద్ లాంటి ఎన్నికలు గతంలో ఎక్కడా చూడలేదని, కుటుంబ రాజకీయాలు చేసేవారిని తెలంగాణ ప్రజలు తిప్పికొడుతారని విమర్శించారు. క్యాబినెట్ మంత్రిగా నాకు మోడీ అవకాశం కల్పించారని, ఈశాన్య రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
డిసెంబర్ లోపు కరోనా వ్యాక్సినేషన్ చాలా వరకు పూర్తి అవుతుందన్న కిషన్ రెడ్డి మన రాష్ట్రంలో ప్రజల పండగలు ,బతుకమ్మ, గిరిజన పండగలు సమ్మక్క సారక్క జాతరాలు జరుగుతున్నా యి…వచ్చే రెండేళ్లలో వాటిని జాతీయ పండుగాలుగా గుర్తించనున్నామని వెల్లడించారు.