Tuesday, March 17, 2026
HomeTrending Newsకలర్ ఫోటో కు జాతీయ గుర్తింపు

కలర్ ఫోటో కు జాతీయ గుర్తింపు

కలర్ ఫోటో చిత్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు విభాగంలో ఉత్తమ చిత్రంగా కలర్ ఫోటో ఎంపికైంది. 2020 సంవత్సరానికి గాను 64వ జాతీయ అవార్డులను నేడు ప్రకటించారు. తెలుగులో సంధ్యా రాజు నిర్మించి నటించిన ‘నాట్యం’ సినిమాకు రెండు అవార్డులు లభించాయి. బెస్ట్ కొరియో గ్రాఫర్ గా సంధ్యా రాజు, బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ గా రాంబాబు నాట్యం సినిమాకు దక్కాయి. అల వైకుంఠపురంలో సినిమాకు గాను ఎస్ ఎస్ తమన్ కు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు గెల్చుకున్నారు.

జాతీయ ఉత్తమ నటుడిగా ఇద్దరినీ జ్యూరీ ఎంపిక చేశింది. తమిళ హీరో సూర్య (సూరారై పోట్రు- తెలుగులో ఆకాశమే నీ హద్దురా); అజయ్ దేవగన్ (తన్హాజీ)లు ఉమ్మడిగా ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా ‘సూరారై పోట్రు’ నటించిన అపర్ణా బాలమురళికి దక్కింది. జాతీయ ఉత్తమ చిత్రంగా కూడా ఈ సినిమా ఎంపికైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular