Monday, May 20, 2024
Homeసినిమా స్టాండప్ కమెడియన్ పాత్రలో నవీన్ పోలిశెట్టి

 స్టాండప్ కమెడియన్ పాత్రలో నవీన్ పోలిశెట్టి

యంగ్ టాలెంట్ నవీన్ పోలిశెట్టి, అందాల తార అనుష్క శెట్టి హీరో హీరోయిన్లుగా యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు పి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క చెఫ్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా. సోమవారం హీరో నవీన్ పోలిశెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆయన క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

కామెడీ టైమింగ్ లో మంచి పేరున్న నవీన్ ఈ చిత్రంలో కమెడియన్ సిద్ధు పోలిశెట్టి క్యారెక్టర్ లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది తెరపైకి రానున్న ఈ మూవీపై ఫిల్మ్ లవర్స్ లో మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రానికి సంగీతం – రధన్, సినిమాటోగ్రఫీ- నీరవ్ షా, ఆర్ట్ – రాజీవన్ నంబియార్, నిర్మాణం – యూవీ క్రియేషన్స్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్