Saturday, November 23, 2024
HomeTrending Newsపెన్సిల్వేనియా వర్సిటీ హెడ్ గా తెలుగు మహిళ

పెన్సిల్వేనియా వర్సిటీ హెడ్ గా తెలుగు మహిళ

Neeli Bendapudi:
భారతీయ సంతతికి చెందిన వ్యక్తి, తెలుగు వాసి అయిన నీలి బెండపూడి అమెరికాలోని ప్రతిష్టాత్మక పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఆమె ఎంపికను పెన్సిల్వేనియా స్టేట్ బోర్డ్  ధృవీకరించింది.  2022 మార్చి నెలలో ఆమె ఈ కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.  ఈ బాధ్యతలు స్వీకరించబోయే తొలి మహిళగా, తొలి నల్లజాతి వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు.

ప్రస్తుతం ఆమె లూయీస్ విల్లె యూనివర్సిటీ ప్రెసిడెంట్ గా, మార్కెటింగ్ విభాగానికి అధిపతిగా ఉన్నారు. ఈ యూనివర్సిటీకి 18వ ప్రెసిడెంట్ గా ఆమె వ్యవహరిస్తున్నారు. మార్కెటింగ్, వినియోగదారుడి అలోచన, ప్రవర్తన  అంశాల్లో నీలి బెండపూడి చేసిన పరిశోధనలు, ప్రసంగాలు ఆమె ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాయి.

విద్యా రంగంలో 30 సంవత్సరాల అపార అనుభవం ఉన్న నీలి, అమెరికాలోని పలు కీలక యూనివర్సిటీల్లో వివిధ విభాగాల్లో పనిచేసి తన సమర్ధతను చాటుకున్నారు. కాన్సాస్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛాన్సలర్ గా, బిజినెస్ స్కూల్ డీన్ గా ఆమె పనిచేశారు. ఒహియో యూనివర్సిటీ లో కూడా మేనేజ్మెంట్ విభాగానికి ఫౌండింగ్ డైరెక్టర్ గా కూడా ఉన్నారు.

ప్రపంచ ప్రసిద్ధి చెందిన పెన్సిల్వేనియా యూనివర్సిటీ లో తనకు ఇలాంటి పదవి దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, అంకితభావంతో పనిచేసి ఈ సంస్థ ప్రతిష్టను మరింత పెంచేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని నీలి వెల్లడించారు.

Also Read : వ్యాక్సిన్లతో లక్షల కోట్ల లాభాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్