భారత ఆటగాడు, జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. స్విట్జర్లాండ్ లోని లసాన్నేలో జరిగిన ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ టోర్నమెంట్ లో విజేతగా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా తన పేరు లిఖించుకున్నారు. నిన్న అర్థరాత్రి తర్వాత జరిగిన పోటీల్లో తొలి ప్రయత్నంలో విఫలమైన నీరజ్ తన రెండవ ప్రయత్నంలో 88.4 మీటర్లపాటు విసిరి గోల్డ్ మెడల్ ఖాయం చేసుకున్నాడు. మొదటి సారి 84.14మీటర్లు విసిరిన జాకుబ్ వాడ్లేచేక్ రెండో సారి 86 మీటర్లు మాత్రమే విసర గలిగాడు.
టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సంపాదించిన నీరజ్ చోప్రా వరల్డ్ ఛాంపియన్ షిప్స్ పోటీల్లో రజత పతకం గెల్చుకున్న సంగతి తెలిసిందే. గాయం కారణంగా కామన్ వెల్త్ గేమ్స్ కు దూరమైన నీరజ్ ఆగస్టులో జరిగిన అర్హతా పోటీల్లో సత్తా చాటి డైమండ్ లీగ్ ఫైనల్స్ కు అర్హత సంపాదించాడు.
Also Read : Be Active: అందరం ఆడదాం: చోప్రా పిలుపు