Tuesday, September 17, 2024
HomeTrending NewsParil Olympics: ఫైనల్స్ కు నీరజ్ చోప్రా

Paril Olympics: ఫైనల్స్ కు నీరజ్ చోప్రా

పారిస్ ఒలింపిక్స్ జావెలిన్ త్రో విభాగంలో ఇండియా ఆటగాడు నీరజ్ చోప్రా ఫైనల్స్ కు చేరుకున్నాడు. నేడు జరిగిన ఫైనల్స్ క్వాలిఫికేషన్స్ రౌండ్ లో నీరజ్ 89.34 మీటర్ల పాటు విసిరి తన కెరీర్ లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి పతకం రేసులో నిలబడ్డారు.

టోక్యో వేదికగా జరిగిన గత ఒలింపిక్స్ లో  నీరజ్ అత్యధికంగా 87.58 మీటర్లు విసిరి స్వర్ణ పతాక విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.  ఆ మరుసటి ఏడాది 2022లో అమెరికాలోని ఒరెగాన్ లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ లో జరిగిన పోటీల్లో 88.13  మీటర్లు విసిరి రజతం దక్కించుకున్నాడు. ఆ వెంటనే జ్యూరిచ్ లో జరిగిన డైమండ్ లీగ్ లో 88.13  మీటర్లు విసిరి స్వర్ణం సొంతం చేసుకొని డిమాండ్ లీగ్ గెల్చుకున్న తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు.  గత ఏడాది బుడాపెస్ట్ లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్  ఛాంపియన్ షిప్ పోటీల్లో ఫైనల్స్ లో 88.17 మీటర్లు విసిరి స్వర్ణం సాధించి మరోసారి తన సత్తా చాటాడు.

ప్రస్తుతం పారిస్ లో జరుగుతోన్న ఒలింపిక్స్ లోనూ స్వర్ణం సాధించి వరుసగా రెండో సారి ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నీరజ్ సరికొత్త చరిత్ర లిఖించాలని భారతీయులు కోరుకుంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్